Breaking News

సుప్రీం కోర్ట్ లో సుగాలి ప్రీతి కేసు..!

17 th Oct 2020, UTC
సుప్రీం కోర్ట్ లో సుగాలి ప్రీతి కేసు..!

కర్నూల్ జిల్లాలో సుగాలి పై జరిగిన అన్యాయం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఇప్పటివరకు పురోగతి లేదు. తమకు న్యాయం చేయాలనీ సుగాలి ప్రీతి తల్లితండ్రులు కాళ్లరిగేలా తిరుగుతున్నా పోలీస్ లు పట్టించుకోలేదు. దీనితో ఈ కేసు విషయమై సుగాలి ప్రీతి తల్లి తండ్రులు సుప్రీం కోర్ట్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో సుగాలి ప్రీతీ  తల్లి తండ్రులు నిర్భయ కేసులో వాదనలు వినిపించిన న్యాయవాది సీమా కుష్వాహను కలిశారు. 

ఏపీ పోలీసులు తమ కేసును పట్టించుకోవడం లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలనీ ర్యాలీ చేసారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలలకు తమ కేసుని సిబిఐకి అప్పగించారు. కానీ ఇప్పటి వరకు ఈ కేసును సిబిఐ పట్టించుకోలేదు అని వారు సీమా కుష్వాహాకు తెలిపారు. దీంతో 2017లో సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సీమా కుష్వాహా సిద్ధం అవుతున్నారు. 

సుప్రీమ్ కోర్ట్ పర్యవేక్షణలోనే సుగాలి ప్రీతి కేసు సీబీఐ విచారణ జరగాలని ఆమె పిటిషన్ దాఖలు  చేయనున్నారు. “నిర్భయ” న్యాయవాది సీమా కుష్వాహ ప్రీతి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కూడా సుప్రీంకోర్టులో వచ్చే వారం పిటీషన్ దాఖలు చేయనున్నారు. 2017 వ సంవత్సరంలో కట్టమంచి రామలింగ రెడ్డి స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి పై అత్యాచారం జరిగింది. వారు ఆమెను హత్య చేసారు .తమ కూతురుకు న్యాయం చేయాలనీ గత ఐదు రోజులుగా సుగాలి తల్లి తండ్రులు ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. తమ కూతురు పై జరిగిన అత్యాచారం, హత్య కు కారణమైన వారి పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో ఎస్సీ కమిషన్, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సహా, సిబిఐ అధికారులను కూడా సుగాలి తల్లి తండ్రులు కలిశారు. ఈ క్రమం లో నిర్భయ కేసుని వాదించిన సీమా కుష్వాహాను కూడా కలిశారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox