Breaking News

మధ్యాహ్న భోజనం నాణ్యతపై సీఎం కు ఫిర్యాదు చేస్తా.. స్పీకర్ తమ్మినేని సీతారం భార్య వాణిశ్రీ 

07 th Mar 2021, UTC

ఆంధ్రప్రదేశ్ :ఆమె స్వయంగా శాసనసభ స్పీకర్ భార్య. అంతేకాదు పంచాయితీ సర్పంచ్ కూడ. దీనితో తన దృష్టికి వచ్చిన సమస్యపై వెంటనే స్పందించారు. అంతేకాదు దీనిపై స్వయంగా సీఎంకు కూడ ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఇంతకీ సమస్యఏమిటంటే మధ్యాహ్న భో్జనంలో నాణ్యత లోపించడం. ఆముదాలవలస మండలంలోని తొగరాం పంచాయతీ సర్పంచ్‌గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణిశ్రీ. ఆ పంచాయతీలోని తమ్మయ్యపేట గ్రామంలో శనివారం పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఆమెకు స్థానిక సమస్యలను వివరించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ వాణిశ్రీ సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తమ పిల్లలు తినలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. భోజనాన్ని పరిశీలించిన ఆమె వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. తాను విజయవాడ వెళ్లి సీఎంను కలుస్తానని కూడ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox