Breaking News

నలుగురు వైసీపీ నేతలకు సెక్యూరిటీ పెంపు

24 th Nov 2021, UTC
 నలుగురు వైసీపీ నేతలకు సెక్యూరిటీ పెంపు

వరుస బెదిరింపుల వస్తున్న నేపథ్యంలో నలుగురు వైసీపీ నేతలకు ప్రభుత్వం భద్రత పెంచింది. మంత్రి కొడాలినాని, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ , వల్లభనేని వంశీలకు ఇప్పటి వరకు ఉన్న 1+1 భద్రతను 4+4 కు  పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో బెదిరింపులు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా భద్రత పెంచినట్లు తెలుస్తోంది.

టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వల్లభనేని వంశీ మాజీ మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి అభ్యంతర వ్యాఖ్యలు చేసారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగా ద్వారంపూడి చంద్రశేఖర్, కొడాలి నాని, అంబటి రాంబాబు తదితరులు  అదే వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు.దీనిపై తీవ్రంగా కలత చెందిన చంద్రబాబు నాయుడు తాను తిరగి సీఎంగా అయిన తరువాతే అసెంబ్లీలో అడుగు పెడతానని శపధం చేసి వెళ్లిపోయి తరువాత ప్రెస్ మీట్లో కన్నీరు పెట్టారు.

 అనంతరం దివంగత సీఎం ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ , ఇతర కుటుంబ సభ్యులు కూడ పై నలుగురు వైసీపీ నేతలను తప్పు పట్టారు. అప్పటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. దీనితో ఈ నలుగురికి సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తోంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox