Breaking News

సెప్టెంబర్ 5న స్కూళ్లను ప్రారంభించండి : సీఎం జగన్

04 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ : కరోనా మహమ్మారి నేపధ్యంలో పాఠశాలలను మూసి వేసిన సంగతి తెలిసిందే. పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో,పరీక్షలను కూడా రద్దు చేసారు. పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేసేసారు. ఈ స్కూళ్లను తిరిగి ఎప్పటికి ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ లో స్కూళ్లను తిరిగి తెరిచి 2020 -21 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలంటూ ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేసారు.

          మంగళవారంఆయన నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో,విద్యార్థులకు అందించనున్న జగనన్న విద్యాకానుక కిట్లను సీఎం జగన్ పరిశీలించారు. ఈ సమావేశం అనంతరం జగన్ మాట్లాడుతూ,"సెప్టెంబర్ 5 వ తేదీ నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని" అన్నారు. ఇందుకోసం నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులను పూర్తి చేయాల్సిందిగా కోరారు. ప్రతి స్కూల్లో వాల్ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలని ఆదేశాలు జారీ చేసారు. విద్యార్థులను ఆకట్టుకునేలా పాఠశాలలు ఉండాలని చెప్పారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ,విద్యార్థుల కోసం,పాఠశాలలను తిరిగి పున:ప్రారంభించడం కోసం అన్నిటిని పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం తాలూకు మొదటి దశ పనులు దాదాపు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు.  మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox