ఆంధ్రప్రదేశ్ :తన పినతండ్రి అశోక్ గజపతిరాజు సింహాచలం దేవస్ధానం అభివృద్ధి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని సంచయిత గజపతిరాజు విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉండికూడా కనీసం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించలేదని విరుచుకుపడ్డారు.గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‌మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) స్కీమ్‌కు తిరుపతి, శ్రీశైలం దేవస్థానాలను గుర్తించినా, గతంలో సింహాచలం దేవస్థానాన్ని ఎందుకు ప్రతిపాదించలేదని ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రంలోనూ వారే అధికారంలో ఉన్నారని అయినా కూడా కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రిచంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకి నిజమైన ప్రేమ ఉంటే కేంద్రానికి ప్రతిపాదనలు పంపేవారు కదా అని వ్యాఖ్యానించారు.
ప్రసాద్ పథకానికి సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు. దేవస్థానం భూముల్లో మొక్కల పెంపకంలో ఎకరానికి లక్ష రూపాయిలిచ్చే స్కీమ్‌ని కేంద్రం ప్రవేశపెట్టినా గత పాలకులు అప్పట్లో నిర్లక్ష్యం చేశారు. ప్రసాద్ స్కీమ్‌లో సింహాచలం దేవస్ధానాన్ని చేర్చాలని ఎందుకు ప్రతిపాదించలేదు. సింహాచలం దేవస్ధానంలో వృధాగా ఉన్న వేలాది ఎకరాలలో ఈ పధకం క్రింద అభివృద్ది చేసే అవకాశాన్ని అశోక్ గజపతిరాజు ఎందుకు పట్డించుకోలేదు. ఉత్తరాంద్రతో పాటు సింహాచలంపై చంద్రబాబు, అశోక్ గజపతిల కపటప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలి.
మోతీ మహల్ లాంటి పురాతన కట్టడాల అభివృద్దికి కేంద్రం నిదులిచ్చే అవకాశం ఉన్నా కూడా ఎందుకు కూల్చేశారని ఆమె ప్రశ్నించారు. కేంద్ర, రాష్డ్ర ప్రభుత్వాల సహకారంతో సింహాచలం దేవస్ధానాన్ని పూర్తిగా అభివృద్ది చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపటం వల్లే కేంద్రం ఈ స్కీమ్ లో సింహాచలం దేవస్ధానానికి అవకాశం కల్పించింది. మార్చి నెలలో కేంద్ర పర్యాటక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలని ఫాలో అప్ చేశానని ఆమె తెలిపారు.
ఈ పధకంలో కేంద్రం ఇచ్చే నిధులతో భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించగలుగుతాం. గత చైర్మన్ అశోక్ గజపతిరాజు సింహాచలంపై భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నాకు చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. సింహాచలం దేవస్ధానం అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. నా పనితీరు ద్వారానే నాపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెబుతానంటూ ఆమె స్ఫష్టం చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
16 Jan 2021
15 Jan 2021
16 Jan 2021
16 Jan 2021
16 Jan 2021