Breaking News

సంచయిత మాతో అవమానకర రీతిలో ప్రవర్తించారు..!

29 th Oct 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :మాన్సన్ ట్రస్ట్ వ్యవహారాలకు సంబంధించి ఆనంద గజపతిరాజు కుటుంబీకుల మధ్య వివాదాలున్న సంగతి విదితమే. ఇటీవల విజయనగరం పైడితల్లి సిరిమాను ఉత్సవాలలో పాల్గొనడానికి ఆనంద గజపతిరాజు మరో కుమార్తె ఊర్మిళ గజపతిరాజు కూడా వచ్చారు. అయితే ఊర్మిళ గజపతి రాజు మరియు ఆమె తల్లితో సంచయిత రాజు అవమానకర రీతిలో వ్యవహరించారని ఊర్మిళ ఆరోపిస్తున్నారు.

ఈరోజు ఊర్మిళ గజపతి రాజు తమ బంగ్లా లో  మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.. సంచయిత గజపతి రాజు పై ఆమె విమర్శలు గుప్పించారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం తమకు ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఆనవాయితీ ప్రకారమే ఈ ఏడాది కూడా తన తల్లితో పాటు ఉత్సవాలు చూడడానికి వచ్చినట్లు తెలిపారు. అమ్మవారి వేడుకలు చూడడం కోసం వస్తే, తమ పట్ల సంచయిత గజపతిరాజు అవమానకర రీతిలో ప్రవర్తించారని ఆరోపించారు. తాము కోటలోకి వస్తే సంచయిత మండిపడి, వీళ్ళని ఎవరు రానిచ్చారు అంటూ సిబ్బంది పై మండిపడినట్లు తెలిసిందని చెప్పుకొచ్చారు.  

కోటపై ముందు వరసలో ఉన్న తమను వెనక్కి వెళ్లాలంటూ ఆలయ ఈవో వచ్చి చెప్పారని ఆవేదన వ్యక్తం చేసారు.. ఈవోని అడిగి, కొంతసేపు అక్కడే ఉండి, అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడనుంచి వెళ్లిపోయామని ఊర్మిళ తెలిపారు. ఇలాంటి అనుభవం ఎదురవుతుందని తాము ముందే ఉహించామన్నారు. సంచయిత అహంకారంతో ప్రవర్తిస్తున్నారన్నారు. మాన్సన్ ట్రస్ట్ సభ్యురాలిగా తన తల్లిని ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదన్నారు. మాన్సన్ ట్రస్ట్ సొంత ట్రస్ట్ లా భావిస్తూ పెత్తనం చెలాయిస్తున్నారన్నారు.  ఆనంద గజపతి వారసులుగా కోట బురుజుపై నుంచి సిరిమాను ఉత్సవం చూసే హక్కు తమకు ఉందని ఆమె స్పష్టం చేసారు. ఊర్మిళ, ఆమె తల్లి సుధా గజపతిరాజులను అక్కడ నుంచి పంపించేయడానికి పోలీస్ లు నిస్సహాయతను వ్యక్తం చేసారు. మరో వైపు సంచయిత కుర్చీ వేసుకుని వేడుకలను తిలకించారు. ఊర్మిళ, ఆమె తల్లి సుధా గజపతిరాజులు కోటకు మరో వైపు కూర్చుని వేడుకల్ని తిలకించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox