Breaking News

సాయికుమార్ ముఠా ఏపీలోనూ రూ.15 కోట్లు కొల్లగొట్టేసారు..

13 th Oct 2021, UTC

తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాహా చేసిన వారే ఏపీ కి  చెందిన రెండు కీలకమైన సంస్థల్లో నిధులను కొల్లగొట్టారని  పోలీసులు గుర్తించారు. తెలుగు  అకాడమీ స్కామ్‌లో నిధులను కొల్లగొట్టిన  సాయికుమార్  ముఠా  ఏపీ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ , ఏపీ ఆయిల్ ఫెడరేషన్  ల నుండి రూ. 15 కోట్ల  ఫిక్స్‌డ్ డిపాజిట్లను కొల్లగొట్టారు.

ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ నుండి రూ. 9 కోట్లు, ఏపీ ఆయిల్ ఫెడ్ నుండి రూ. 6 కోట్లను కొల్లగొట్టారని అధికారులు గుర్తించారు. గిడ్డంగుల శాఖకు రూ. 32 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయి. వీటిలో భవానీపురంలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ.9.60 లక్షలను నిందితులు డ్రా చేశారని ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ ఎండీ తెలిపారు. ఈ విషయమై బ్యాంకు అధికారులతో వేర్ హౌసింగ్ కార్పోరేషన్ అధికారులు మాట్లాడారు. దీంతో బ్యాంకు అధికారులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతుపై విచారణ చేస్తున్నారు.తెలంగాణ అకాడమీలో నిధులు కొల్లగొట్టిన నిందితులే ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్వాహా చేశారని తెలంగాణ పోలీసులు తమకు సమాచారం అందించారని  వేర్ హౌసింగ్ అధికారులు తెలిపారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ కావడానికి ముందే  నిధులు తరలించారని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ ప్రకటించారు తమకు తెలియకుండానే ఈ నిధులను డ్రా చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులను ఈ విషయమై ఎండీ ప్రశ్నించారు. దీంతో ఈ విషయమై నిందితులకు బ్యాంకు ల నుండి ఎవరైనా సహకరించారా అనే కోణంలో బ్యాంకు అధికారులు ఆరా తీస్తున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox