పుత్తూరు ద్రౌపతి దేవి సమేత ధర్మరాజులు స్వామి వారి ఆలయ తిరునాళ్ల కు అమ్మవారికి శాస్త్రోత్తం గా పట్టు వస్త్రాలు సమర్పించడం ఎప్పటినుంచో ఆనవాయితీ గా వస్తోంది.. ఈ సందర్భంగా కొన్నేళ్లు గా వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఎమ్మెల్యే శ్రీమతి ఆర్ కే రోజా సెల్వమణి దంపతులు సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ,అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.. ఈ దేవాలయం లో రాజ గోపురం నిర్మాణం ఎన్నో ఏళ్ల నుంచి తీరని కలగా ఉంది.. ఎన్నో దశాబ్దాలుగా ఈ ఆలయానికి తీరని కోరిక అయినటువంటి ఈ రాజగోపురం నిర్మాణమునకు దేవాదాయశాఖ నుంచి 25.00 లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే రోజా గారు కామన్ గూడ్స్ ఫండ్స్ ద్వారా మంజూరు చేయించిన విషయం తెలిసిందే. దీనిపట్ల.. దేవాదాయ సిబ్బంది కూడా సంతృప్తి గా ఉన్నారు.. అంతే కాకుండా.. ఆలయం తరఫున డిపాజిట్ నిధులకు గాను తన వంతు విరాళంగా 50,000.00 రూపాయలను ఎమ్మెల్యే ఆర్కే రోజా విరాళం ఇచ్చారు..