Breaking News

నేటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటింటికి బియ్యం..!

07 th Jun 2020, UTC
నేటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటింటికి బియ్యం..!
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.. నేటి నుంచి నేరుగా ఇంటింటికి  నాణ్యమైన బియ్యాన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా అమరావతిలో ముందుగా మొబైల్‌ యూనిట్ల ద్వారా ఇంటింటికి వెళ్లి బియ్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ట్రయల్‌ రన్‌ ద్వారా పరీక్షించనున్నారు. మొబైల్‌ వాహనంలోనే ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మిషన్‌ను ఏర్పాటు, లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్‌ ఓపెన్‌ చేసి రేషన్‌ పంపిణీ, బియ్యం తీసుకునేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన బ్యాగులను లబ్ధిదారులకు ముందుగానే ఇవ్వనునట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌అఫీషియో కార్యదర్శి శశిధర్‌ చెప్పుకొచ్చారు. 
      ప్రయోగాత్మకంగా మొబైల్‌ యూనిట్ల ద్వారా పంపిణీ నిర్వహిస్తారు. ఏమైనా.. లోపాలు ఉంటె.. వాటిని సవరించుకుని తిరిగి సెప్టెంబర్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 13వేల 370 మొబైల్‌ యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టెండర్లను పిలుస్తామని ఈ సందర్భం గా అధికారులు వెల్లడించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox