Breaking News

టీడీపీ నేత కళా వెంకట రావు అరెస్ట్ వెనుక అసలు కారణమేంటి..?

21 st Jan 2021, UTC

నిన్న రాత్రి కళా వెంకట రావు ను పోలీసులు అరెస్ట్ చేసి, తిరిగి రాత్రి పదకొండున్నర ప్రాంతంలో విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట రావు ను అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది. హఠాత్తుగా కళా వెంకట రావు ఇంటికి పోలీసులు వచ్చి, కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా తీసుకువెళ్లడం పట్ల టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. తిరిగి కళా వెంకట రావు ను విడుదల చేసేవరకు ఈ ఉత్కంఠ కొనసాగింది. 

తాజాగా, ఎస్పీ రాజకుమారి కళా వెంకట రావు అరెస్ట్ పై స్పందించారు.  విజయనగరం జిల్లా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 2వ తేదీన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కళా వెంకట రావు పై ఫిర్యాదు ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై విచారణకు హాజరు కావాల్సిందిగా వెంకట రావును ఇప్పటికే పలుసార్లు కోరామని రాజకుమారి పేర్కొన్నారు. అయితే, వెంకట రావు స్పందించకపోవడంతో పిలిచి విచారణ చేసాక నోటీసు ఇచ్చి పంపామన్నారు. 

అయితే తనను అరెస్ట్ చేయడం పై స్పందించిన కళా వెంకట్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దేవుళ్ళ విగ్రహాలపై ఇన్ని దాడులు జరుగుతున్నా పోలీసులు ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదని, అన్యాయాలపై ప్రశ్నిస్తున్న వారిని మాత్రం అరెస్ట్ లు చేస్తున్నారని మండిపడ్డారు. రామతీర్ధం ఘటన జరిగిన తరువాత, ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు, విజయ సాయి రెడ్డి ఒకేరోజు వచ్చారు. విజయ సాయి రెడ్డి చంద్రబాబు కంటే ముందుగా వచ్చారు. ఈ క్రమంలో, విజయ సాయి రెడ్డి పై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీనితో, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో పోలీసులు కళా వెంకట్ రావు పై కేసు నమోదు చేసారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox