Breaking News

వైసీపీ పార్టీ కి రఘురామకృష్ణ రాజు సవాల్...!

16 th Sep 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ పార్టీ అధినాయకత్వానికి సవాల్ విసిరారు. గతంలో కూడా ఆయనపై ఆరోపణలు వస్తే, అనర్హత వేటు వేసుకోమంటూ పార్టీ అధిష్టానానికి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో సారి పార్టీ అధిష్టానం పై ధ్వజమెత్తారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి తనపై అనర్హత వేటు వేయాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. కావాలంటే రాజ్యాంగంలోని షెడ్యూల్ 10ని ఓసారి చదువుకోవాల్సిందిగా తమ పార్టీ ఎంపీలకు సూచిస్తున్నానని అన్నారు.

చదవండి : అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లో దోషులు ఎవరు..? ప్రైమ్ 9 చేతిలో FIR కాపీ..!

ఏరోజైనా మిధున్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పనుల గురించి మాట్లాడాడా? అని ప్రశ్నించారు. లోక్ సభా పక్ష నేత ఎన్నిక జరిపితే మిథున్ రెడ్డికి 3 ఓట్ల కంటే ఎక్కువ రావని రఘురామ కృష్ణ రాజు ధ్వజమెత్తారు. చాలామంది ఎంపీలకు మిధున్ రెడ్డి పై అసంతృప్తి ఉందన్నారు. పార్టీ నుంచి బహిష్కరించినా కూడా తానూ పార్లమెంట్ లో  కమిటీ చైర్మన్ గా కొనసాగుతానని  రఘురామ కృష్ణ రాజు స్పష్టం చేసారు. కావాలంటే బహిష్కరించుకోమని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చట్ట ప్రకారం తన పై అనర్హత వేటు వేయడం సాధ్యపడదని రఘురామకృష్ణ రాజు తేల్చి చెప్పారు. ఈ కమిటీ చైర్మన్ పదవి తన వాక్పటిమ కారణంగా తెచుకోగలిగానన్నారు. పదవులన్నీ మీ కులస్తులకేనా అని ప్రశ్నించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox