ఇప్పటికైనా రమేష్‌కుమార్‌ను ఎస్ఈసీ పోస్టులో పెట్టాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించడానికి మీకేమైంది?, గవర్నర్ మాట వినలేదు.. కనీసం సుప్రీంకోర్టు తీర్పునైనా గౌరవించండి. అత్యున్నత స్థాయిలో గెలిచిన వైసీపీ.. అంతేస్థాయిలో ఉన్నతంగా ఆలోచించండి. ఎవరో చెప్పే చెప్పుడు మాటలు ముఖ్యమంత్రి వినొద్దు.’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇకనైనా దయచేసి న్యాయ వ్యవస్దను గౌరవించండి. ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఈ విధానానికి సీఎం జగన్ పుల్ స్టాప్మ పెట్టాలి. అనసరంగా న్యాయ వ్యవస్దతో పెట్టుకుని ఆర్టికల్ 356 కొనితెచ్చుకోవద్దు అని అన్నారు.
న్యాయవ్యవస్థతో చీవాట్లు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ‘నేను సలహా ఇస్తే స్వీకరించరు. సలహాదారులు బోలెడంత మంది ఉన్నా.. వారేమో సరైన సలహాలు ఇవ్వరు. చెప్పుడు మాటలు విని ముఖ్యమంత్రేమో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ్ న్యాయవ్యవస్థను కొంతమంది పార్టీలో ఉన్న నేతలే కించపరుస్తూ, దుర్భాషలు ఆడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. పార్టీ పెద్దలే అలాంటి వాళ్లకు సపోర్టు చేశారు.ఒకవేళ విమర్శలు చేస్తే తప్పేంటి?, విమర్శలను స్వీకరించి సరిచేసుకోవాలి కదా?, మనం ఏం చేసినా ఫర్వాలేదు అనుకుంటే కరెక్టు కాదన్నారు.