Breaking News

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదు

08 th Mar 2021, UTC
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంట్ లో ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ జవాబిచ్చారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధలేదని ఆమె చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవన్నారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై జగన్‌ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని ఆమె పేర్కొన్నారు. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్నారు. స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడులను ఉపహరించుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఏపీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. విశాఖలో చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. ఏపీ, తెలంగాణ మావోయిస్టులు కూడా ఇప్పటికే సంఘీభావం ప్రకటించారు. స్టీల్ ప్లాంట్‌పై  తాజాగా కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటన రాజకీయ చర్చకు దారితీస్తోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox