Breaking News

చేతకాని ఎంపీల వల్ల పోలవరానికి రూ.30వేల కోట్లు నష్టం నారా లోకేష్ 

30 th Oct 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :పోలవరం 70శాతం పూర్తయితే మీసం తీయించు కుంటానని ఒక మంత్రి గతంలో చెప్పారని, ప్రస్తుతం ఆయన ఎక్కడ వున్నారని మాజీ మంత్రి  నారాలోకేష్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారని, చేతకాని 22మంది ఎంపీల వల్ల పోలవరానికి రూ.30వేల కోట్లు నష్టమన్నారు.వైఎస్సార్‌సీపీ కి  22మంది ఎంపీలు ఉన్నారని, ప్రత్యేక హోదా ఏమైందో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.

రైతుల్ని పరామర్శించడానికి వెళితే తనను ఎద్దు అని ఒక మంత్రి అన్నారని, మరి గాల్లో తిరిగిన ముఖ్యమంత్రి జగన్‌ను ఏమనాలని ప్రశ్నించారు. తనకు హోదా లేదని, ఆవేదన ఉందన్నారు. వారం వరదలో మునిగితేనే సహాయం అంటారా? మానవత్వం లేదా అని మండిపడ్డారు. అధిక వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, గోదావరి జిల్లాల్లో వరి పంట మూడు సార్లు మునిగిందని, రాయలసీమలో 10 లక్షల ఎకరాల వేరుశెనగ దెబ్బతిన్నదన్నారు. రైతుల్ని ఆదుకోవడానికి మనసు ఉండాలి డబ్బులు కాదని లోకేష్ అన్నారు.

తిత్లీ వస్తే తమ ప్రభుత్వ హాయాంలో 28 రోజుల్లో శ్రీకాకుళం జిల్లాకు రూ.160 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక రూ.25 లక్షల సహాయం మాత్రమే చేశారన్నారు. రైతుకు రూపాయి ఇవ్వకుండా రైతు రాజ్యం ఎలా అవుతుందన్నారు. ఏడాదిన్నరలో 750మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటమేనా రైతు రాజ్యమంటే నష్టం అంచనా 100శాతం చేయాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.25వేలు పరిహారం చెల్లించాలని, ఆక్వా రంగం కుదేలైనందున ఎకరాకు రూ.5లక్షలు ఇవ్వాలన్నారు. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం చెల్లించాలని.. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.5వేలు పరిహారం ఇవ్వాలని  లోకేష్ డిమాండ్ చేశారు.

ఏపీలో ఏసీబీ, సీఐడీ పనికిరాని విభాగాలని ప్రభుత్వం ఒప్పుకుంటుందా రాజధానిపై సీబీఐ విచారణ జరపాలని ప్రభుత్వం ఎందుకు అంటోందని ప్రశ్నించారు. జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణను జగన్ ఎందుకు వద్దన్నారని ప్రశ్నించారు. 4వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయానికి మీటర్ల బిగింపు తగదన్నారు. చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారని, జగన్ ప్యాలెస్‌లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలన్నారు. వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే వాటిని పీకేస్తామని సైకిళ్లకు మీటర్లు కట్టి ఊరేగిస్తామని లోకేష్ హెచ్చరించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox