Breaking News

మాజీ మంత్రి పితాని కుమారుడు బెయిల్ పిటిషన్ తిరస్కరణ..!

13 th Jul 2020, UTC

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్‌ సహా మరో ఇద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో తనను అరెస్టు చేస్తారనే భయంతో పితాని కుమారుడు వెంకట సురేష్‌, పితాని మాజీ పీఎస్‌ మురళీమోహన్‌ హైకోర్టును ఆశ్రయించారు.  సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మురళీమోహన్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే..
తెలుగుదేశం ప్రభుత్వ హయంలో అచ్చెన్నాయుడు తర్వాత పితాని సత్యనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అచ్చెన్నాయుడు హయాంలో మందుల కొనుగోలు, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున స్కాం జరిగింది. ఆ స్కాం పితాని సత్యనారాయణ హయాంలోనూ కొనసాగింది.

 పితాని మంత్రిగా ఉన్న సమయంలో కార్మికశాఖలో ఏ పని జరగాలన్నా మంత్రి కుమారుడు వెంకట్‌ కనుసన్నల్లోనే జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఏ కాంట్రాక్టు కావాలన్నా వెంకట్‌ను కలిసి పది శాతం చెల్లిస్తేనే పనులు జరిగినట్లుగా ప్రచారం జరిగింది.

తమ పనుల కోసం కాంట్రాక్టర్లు పితాని స్వగ్రామం కొమ్ముచిక్కాలకు క్యూ కట్టేవారని తెలుస్తోంది. పితాని వెంకట్‌ చీటీపై టెండర్లు ఎవరికి కేటాయించాలో రాసిచ్చేవారని, దాని ఆధారంగానే పనులు జరిగేవని  భోగట్టా. ఈ కేసును ఏసీబీ అధికారులు దర్యాప్తు  చేస్తుండటంతో అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని సురేష్ హై కోర్టును ఆశ్రయంచారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox