ఆంధ్రప్రదేశ్ :ఓ గిరిజన మహిళను ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. ఆ ఘటన గురించి తెలుసుకుంటే తన హృదయం ద్రవించిపోయిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్రుబాయిని ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్ తో తొక్కించి చంపడంతో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చట్టాలపై ఉన్నంత ప్రచారం మహిళల రక్షణ పైన,మాన ప్రాణాలపైనా రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చాం, దిశ స్టేషన్లు ఏర్పాటు చేశాం అని ప్రభుత్వం ప్రచారం చేసుకుందని. గిరిజన మహిళలపై దాష్టీకాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడంలేదని, కేసులు నమోదు చేసుకునేందుకు పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం లేదని విమర్శల వర్షం కురిపించారు. ఆ గిరిజన కుటుంబంపై ఘాతుకానికి పాల్పడ్డ ఆ వడ్డీ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.
కర్నూలు జిల్లాలో ఓ గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం జరిగినా ఇప్పటి వరకు పోలీసులు స్పందించలేదని చెప్పారు. భర్త కళ్ళ ముందే అత్యాచారం చేసారని చెబుతున్నా,ఆ బాధితురాలు బాధను ఎవరు అర్ధం చేసుకోలేదని ఆగ్రహించారు. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టాలు చేసి ఏం ప్రయోజనం? అని ఆగ్రహించారు. దళిత వర్గానికి చెందిన మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి దారుణాలు జరగడం బాధాకరమని ఆయన ఆగ్రహించారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
05 Mar 2021
05 Mar 2021