ఆంధ్రప్రదేశ్ : నిన్న మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు నేడు జనసేన అధినేత
పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. వీరి భేటీ మర్యాద పూర్వకంగా జరిగిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ఏపీ అధ్యక్షులుగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన అనంతరం వీరిద్దరూ సమావేశం కావడం ఇదే మొదటిసారి. ట్విట్టర్ వేదికగా పవన్ శుభాకాంక్షలు చెప్పినా ఇరువురు భేటీ కాలేదు.
గురువారం చిరును కలిసిన సోము. ఇవాళ పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీర్రాజుకు పుష్ప గుచ్ఛం అందించి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి.