ఆంధ్రప్రదేశ్ లో దిశ చట్టం ఏమైపోయిందంటూ జగన్ సర్కార్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో 16ఏళ్ల బాలికపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన హృదయం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందన్నారు. నాలుగు రోజులపాటు చిత్ర హింసలకు గురి చేసిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా పవన్ డిమాండ్ చేశారు.
తన కుమార్తె ఆచూకీ తెలియడం లేదని తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సకాలంలో స్పందించలేదని తెలిసిందని.. ఇలా చేయడం సబబు కాదని పవన్ చెప్పుకొచ్చారు. అసలు మహిళలపై అత్యాచారాల నిరోధానికి తీసుకువచ్చిన దిశ చట్టం ఏమైపోయింది? అని పవన్ ప్రశ్నించారు.
అసెంబ్లీలో ముక్తకంఠంతో ఆమోదం పొందిన ఆ చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదు?. తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటైన రాజమహేంద్రవరంలోనే సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకొంది. దిశ పేరుతో ఏర్పాటైన ఆ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి. ఈ సామూహిక అత్యాచారం వెనక గంజాయి, డ్రగ్స్ ముఠాలు ఉన్నాయనీ, ఇది బ్లేడ్ బ్యాచ్ పనే అని చెబుతున్నారు.
ప్రజలు ఆందోళన చెందుతున్న విషయాన్ని పోలీస్ అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటి ముఠాల ఆగడాలకు కళ్ళెం వేయకపోతే రక్షణ కరవవుతుంది. చట్టం చేయడం కాదు.. వాటిని నిబద్ధతతో అమలు చేస్తేనే మహిళలకు రక్షణ కలుగుతుంది’ అని ప్రకటనలో పవన్ పేర్కొన్నారు.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox