Breaking News

పర్యావరణ పరిరక్షణ జనసేన మూల సిద్ధాంతం : పవన్

05 th Jun 2020, UTC
పర్యావరణ పరిరక్షణ జనసేన మూల సిద్ధాంతం : పవన్
నేడు పర్యావరణ దినోత్సవం సందర్భం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యావరణ ప్రేమికులందరికి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణే జన సేన మూల సిద్ధాంతమని చెప్పుకొచ్చారు. మానవ జాతి సౌభాగ్యం గా మనుగడ సాగించడానికి ప్రకృతే మూలాధారమని పవన్ అన్నారు. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందని పవన్ చెప్పుకొచ్చారు. చక్కని పర్యావరణం ఉన్న చోట.. వైద్యుల అవసరమే ఉండదని.. నిపుణులు చెపుతుంటారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. జనసేన మూల సిద్ధాంతాల్లో కూడా పర్యావరణానికి సముచిత స్థానం కలిపించిన సంగతి అందరికి తెలిసిందేనని అన్నారు. 
             ప్రస్తుతం.. కరోనా కారణం గా గందరగోళ పరిస్థితి నెలకొందని.. ఈ పరిస్థితి చక్కబడగానే ""మన నది- మన నుడి"" కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతం గా చేపడతామని పవన్ కళ్యాణ్ అన్నారు. పర్యావరణానికి హితమైన మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. పర్యావరణాన్ని విషతుల్యం చేసే పరిశ్రమలపై నిరసన గళం వినిపిస్తూనే ఉంటామని పవన్ చెప్పుకొచ్చారు. ప్రకృతే అందరికి ఆరోగ్య ప్రదాయిని అని.. ప్రకృతి ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పవన్ చెప్పారు. మన అడవులను, కొండలను, నదులను మనమే కాపాడుకోవాలని పవన్ అన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox