మాజీ మంత్రి పరిటాల సునీత ఇంట్లో విషాదం జరిగింది.. పరిటాల సునీత తండ్రి కొండన్న ఆసుపత్రి లో చికిత్స జరుగుతుండగానే మరణించారు. శనివారం ఉదయం సునీత తండ్రి ధర్మవరపు కొండన్న తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.. గత కొన్ని రోజులు గా ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. కొండన్న మాజీమంత్రి పరిటాల రవీంద్ర మరణానంతరం ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నారు.
కొండన్న నసనకోట ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్గా ఆయన చాలా కాలం పాటు పనిచేసారు. అనంతపురం లో అత్యధిక భక్తులు సందర్శించే దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఆ దేవాలయ ప్రాంతాన్ని అభివృద్ధి చెందించడం లో కూడా కొండన్న కీలక పాత్ర పోషించారు. ఆలయం చాల పాతదే అయినా.. పరిటాల కుటుంబం ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసింది. ఇందులో ధర్మవరపు కొండన్న పాత్ర ఎంతో ఉంది.
ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో గత కొద్దీ రోజులు గా చికిత్స పొందుతున్న ఆయన చికిత్స జరుగుతుండగానే మృతి చెందారు. ఆయన మరణం తో.. పరిటాల కుటుంబం లో విషాదం నెలకొంది.. ఆయన మృతి పై.. నారా చంద్రబాబు నాయుడు..జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. పార్టీ నేతలు.. కార్యకర్తలు కూడా పరిటాల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.