Breaking News

వసంత కృష్ణ ప్రసాద్ ఆంధ్రా డేరా బాబా.. పంచుమర్తి అనురాధ

30 th Jul 2021, UTC

Politics : ఇంజనీరింగ్ విద్యార్థులను చంపేసిన రౌడీ షీటర్లు, రేప్ కేస్ నిందితులు, ఇసుక దందా రాయుళ్లను పక్కన పెట్టుకుని మైనింగ్ దోపిడీ చేస్తున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నీతులు చెబితే ఎవరు నమ్ముతారు? అంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ప్రెస్ ముందు గొంతు చించుకుంటే నిజాలు అబద్ధాలు కావు. వసంత కృష్ణ ప్రసాద్ ఆంధ్రా డేరా బాబా అని మైలవరం ప్రజలే చెబుతున్నారు. ప్రజల సొమ్మును కాపాడేందుకు దేవినేని ఉమా మిమ్మల్ని ప్రశ్నించినందుకు కక్షకట్టారు. అక్రమ కేసులు బనాయించి జైలు పాల్జేశారు. 1988లో దళిత మహిళను వసంత కృష్ణ ప్రసాద్ కుటుంబం పొట్టన పెట్టుకుంది వాస్తవం కాదా? టీచర్ ను హత్య చేసిన కేసులో ముద్దాయిగా ఉండి నందిగామ సబ్ జైలుకు వెళ్లిన మీరా నీతులు చెప్పేది?'' అని ప్రశ్నించారు. 

''వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అడ్డుపెట్టుకుని ల్యాంకో హిల్స్ లో తక్కువ రేటుకే భూములు కొని ఏ రకంగా సొమ్ములు చేసుకున్నారో అందరికీ తెలుసు. ల్యాంకో హిల్స్ నుంచి కొండపల్లి హిల్స్ వరకూ వసంత కుటుంబ అవినీతి సొమ్ము కూడబెట్టింది. మీ అవినీతిని ప్రశ్నిస్తే బెదిరించి జైలు పాల్జేస్తారా? మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లు ఎవరూ లేరు'' అన్నారు. మనీ లాండరింగ్ కేసుల్లో వసంత కృష్ణ ప్రసాద్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మైలవరం నియోజకవర్గంలో  400 ఎకరాల్లో మీరు డబ్బులు కొట్టేశారని స్థానిక ప్రజలే చెబుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మైనింగ్ అక్రమాలపై ప్రధాని, కేంద్ర అటవీశాఖకు ముఖ్యమంత్రితో లేఖ రాయించండి' ఆమె  సూచించారు.

వీటీపీఎస్ బూడిద కోసం ప్రభుత్వ సలహాదారు దగ్గర మీరు చేసిన పంచాయతీలు రాష్ట్ర ప్రజలకు తెలీదనుకుంటున్నారా? నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే లోకేష్ భాషపై  విమర్శలు చేసే స్థాయి వసంత కృష్ణ ప్రసాద్ కు లేదు. సుహృద్భావం, సార్వభౌమాధికారం అనే పదాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో  చెప్పించండి చూద్దాం. లోకేష్ గారు తెలుగు చక్కగా మాట్లాడతారు. ప్రశ్నా పత్రాలు దొంగిలించి, వాటిని అమ్ముకున్న మీ నేతకు తెలుగు ఎంత బాగా వచ్చో రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. వైసీపీ నేతలకు వచ్చింది తెలుగు కాదు. బూతుల భాష. బూతులపై మీరంతా పీహెచ్ డీలు చేసేశారు' అని అనూరాధ ఎద్దేవా చేశారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox