Breaking News

కొనసాగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

23 rd Jun 2022, UTC
కొనసాగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

Andhrapradesh: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉప ఎన్నికల నిర్వహణకు నియోజకవర్గంలో 279 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 123 సమస్మాత్మక కేంద్రాలుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. మొత్తం 2లక్షల 13వేల 330 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. 

ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. 279 పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. గుర్తింపు కార్డులుతోనే ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. 131 సమస్యాత్మక కేంద్రాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ ఎన్నికలు జరగనున్నాయి. వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు సహాయం చేస్తున్నారు

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox