Breaking News

జగన్ నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయింది.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు

15 th Oct 2021, UTC

 జగన్ నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయిందని వైసీపీ  రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుఎద్దేవా చేశారు.అమ్మఒడి  నిధులను జూన్ నెలకు మార్చడంతో ఒక ఏడాది ఎగ్గొట్టినట్లేనని రఘురామ దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో అమ్మఒడిని నమ్ముకున్న చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడుతున్నారని... ఆయన ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 

విద్యుత్ సమస్య  వల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే పరిస్థితులు తలెత్తాయని అన్నారు. జగనన్న కొవ్వొత్తి-అగ్గిపెట్టె పథకం పెట్టేటట్టు ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని రఘురామ ఎద్దేవా చేశారు. విద్యుత్ సమస్యపై కోల్ ఇండియా ఛైర్మన్‌తో తాను చర్చించానని...  కోల్ ఇండియాకు ఏపీ రూ. 300 కోట్ల బాకీ ఉందని ఆయన తనతో చెప్పారని రఘురామ తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 2.87 లక్షల కోట్ల అప్పులు చేశారని... ప్రభుత్వ ఖజానాలోని రూ. 1.31 లక్షల కోట్లకు లెక్కలు కూడా తేలడం లేదని రఘురామరాజు అన్నారు. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, అప్పులపై పూర్తి వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

విభుత్వ ఉద్యోగులు డీఏ అడుగుతున్నారని, వారి బకాయిలు పెద్ద ఎత్తున ఉన్నాయని రఘురామరాజు   పేర్కొన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox