ఆంధ్రప్రదేశ్ : టీడీపీని ట్విటర్ జూమ్ పార్టీ అంటూ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ ఎద్దేవా చేశారు. విశాఖని అమ్మకానికి ఎపుడు పెడదామా అన్న చరిత్ర చంద్రబాబుదని ఆయన ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో 20 లక్షలకోట్ల పెట్టుబడులు 43 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబుపై ఫిర్యాదు చేయాలనుకున్నా ఆయన మానసిక స్ధితి చూసి వదిలేశామన్నారు. విశాఖపై చంద్రబాబు ఎందుకు పగబట్టారో అర్ధం కావటం లేదన్నారు. వైఎస్సార్ హయాంతో పాటు నేడు సీఎం వైఎస్ జగన్ హయాంలో విశాఖలో జరిగిన అభివృద్దిని మించి చంద్రబాబు చేసినట్లు నిరూపిస్తే తాను రాజీనామాకి సిద్దమని ఆయన చంద్రబాబుకి సవాల్ విసిరారు.
విశాఖ నగరానికి మేలు చేయాలనే ఉద్దేశంతో
సిఎం వైఎస్ జగన్ పరిపాలనా రాజధాని ప్రకటించినప్పటి నుంచి విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.విశాఖలో అన్నిప్రాంతాల ప్రజలు సంతోషంగా నివసిస్తుంటే ఈ నగరంపై చంద్రబాబు బురద జల్లుతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 22 ఏళ్లలో విశాఖకి ఏం చేశారని ప్రశ్నించారు. మీ హయాంలో విశాఖకి చేసిన మేలు ఏమైనా ఉందా అని అడిగారు. రాష్డ్ర విభజన సమయంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి మీరు అమరావతిలో రాజధాని ఎందుకు పెట్టారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అనేది పెద్ద స్కామ్ అని మూడు పంటలు పండే భూములని రాజధాని పేరుతో తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది నిజం కాదా అని అమర్నాధ్ ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు పది మర్డర్లు...లోకేష్ 20 మానభంగాలు చేశారని తాను కూడా ఆరోపించగలనన్నారు.
మరిన్ని వార్తలు చదవండి (
ప్లాస్మా ఇచ్చేవారికి 5వేల రూపాయలు : ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి )