Breaking News

స్థానిక ఎన్నికలు జరిపేది లేదు..తేల్చి చెప్పిన ఏపీ సర్కార్...!

23 rd Oct 2020, UTC

ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పటికే.. ఏర్పాట్లు పూర్తి అయినప్పటికీ.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఏకాభిప్రాయం తో ఈ ఎన్నికలను రద్దు చేసారు. అయితే.. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుందన్న విషయాన్నీ ఆనాడు ఆయన కారణం గా చూపెట్టారు. అయితే.. తాజాగా.. స్థానిక ఎన్నికలను నిర్వహించాలంటూ.. నిమ్మగడ్డ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగం గానే.. అన్ని రాజకీయ పార్టీలకు సమావేశానికి హాజరు కావాల్సింది గా వర్తమానం పంపించారు. ఇందుకోసం ఈ నెల 28 వ తేదీ ముహూర్తం నిర్ణయించారు. 

అయితే.. ఈ నేపధ్యం లో అధికార వైసీపీ పార్టీ స్పందించింది. కరోనా అత్యంత త్వరగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యం లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అయితే.. గతం లో కరోనా ని కారణం గా చూపి ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ.. ఇపుడు తిరిగి తన పదవి కాలం పూర్తి అయ్యే లోపు ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యం లోనే నిధులను విడుదల చేయాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం తో.. హై కోర్ట్ కి వెళ్లారు. 

అయితే.. పాత పిటిషన్ కి సంబంధించి విచారణ లో.. ఓ వైపు బీహార్ శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఏపీ స్థానిక ఎన్నికలను నిర్వహించలేమా అని హై కోర్ట్ ప్రశ్నించింది. ఆ తరువాత.. నిమ్మగడ్డ నిధులకు సంబంధించి పిటిషన్, ఆ తరువాత రాజకీయ పార్టీలతో చర్చలు అంటూ ముందుకొచ్చారు.  అయితే.. మొన్న అంత గా వైరస్ వ్యాప్తి లేని సమయం లో ఎన్నికలు రద్దు చేసి..ఇపుడు రోజుకి నాలుగు వేల కేసులు నమోదు అవుతుంటే.. ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ పట్టు పట్టడం పై చర్చ జరుగుతోంది. అయితే.. హయత్ హోటల్ లో నిమ్మగడ్డ పట్టుబడ్డ వ్యవహారం లో నిమ్మగడ్డ కేవలం ఒక పార్టీ కె అనుకూలం గా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపధ్యం లో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox