Breaking News

ఎన్నికల రద్దు తీర్పు పై నిమ్మగడ్డ నెక్స్ట్ స్టెప్.. హై కోర్ట్ కే సవాల్..!

12 th Jan 2021, UTC

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగాల్సి ఉన్న నేపధ్యంలో ఎన్నికలను రద్దు చేస్తూ, హై కోర్ట్ సింగల్ బెంచ్ పై తీర్పు వెలువరించిన సంగతి విదితమే. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని, వ్యాక్సినేషన్ ప్రక్రియ కు భంగం కలగకూడదని హై కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నిమ్మగడ్డ నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారు. ఆయన డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసుకున్నారు. నిమ్మగడ్డ తరపు పిటిషనర్ ఈ తీర్పు సుప్రీం కోర్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.

సంక్రాంతి పండుగ నేపధ్యంలో వరుస సెలవలు ఉన్నాయి కాబట్టి, ఈ పిటిషన్ ను అత్యవసర పిటిషన్ గా భావించి తీర్పుని ఇవ్వాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో సర్కార్ హై కోర్ట్ ను ఆశ్రయించింది. ఇక కాలంలో ఎన్నికలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ అంశం పై ఉన్న ఇబ్బందులను హై కోర్ట్ కు వివరించింది. దీనితో, ఎన్నికల షెడ్యూల్ సహేతుకంగా లేదని కోర్ట్ అభిప్రాయపడింది. ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణన లోనికి తీసుకోకుండా,ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు సాధ్యం కాదని, నోటిఫికేషన్ ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. తాజాగా, నిమ్మగడ్డ ఈ తీర్పుని సవాల్ చేస్తూ మరో పిటిషన్ వేశారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox