Breaking News

నేడే వైసీపీ రాజ్య సభ సభ్యుల ప్రమాణ స్వీకారం..!

22 nd Jul 2020, UTC

ఇటీవల నూతనంగా రాజ్యసభ కు ఎన్నికైన మెజారిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం పదకొండు గంటలకు వైసీపీ కి చెందిన రాజ్య సభ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. వైసీపీ సభ్యులు  నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డితోపాటు పరిమళ్ నత్వానీ కూడా రాజ్యసభ కు ఎన్నికైన సంగతి తెలిసిందే.
 
         అయితే.. వీరిలో పరిమళ నత్వాని కాకుండా.. మిగిలిన ముగ్గురు వైసీపీ పార్టీ నేతలే.. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పరిమళ్ నత్వాని వ్యక్తిగత కారణాల వలన రాలేకపోయారని.. ఆయన మరొకసారి ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
 
        మరో వైపు.. మంత్రి వర్గ విస్తరణ లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుల కు స్థానం లభించనున్నట్లు తెలుస్తోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల రాజీనామాలతో ఖాళీ అయినా పోస్ట్ లను వీరికి ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నర కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox