Breaking News

కొత్తకొత్త గా

29 th Jun 2020, UTC
కొత్తకొత్త గా
          ప్రతి తండ్రికి పుత్రులుండటం సర్వ సాధారణమే.. కానీ తండ్రి కి తగ్గ పుత్రులుండటం.. పుత్రోత్సాహాన్ని అందించే తండ్రులుండటం.. కొందరి కి మాత్రమే సాధ్యమవుతుంది.. స్వర్గీయులైన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి వ్యక్తుల్లో ఒకరు.. ఆయన ఆశయాలను అందిపుచ్చుకుని.. అనుభవాలని పాఠాలుగా మలచుకుంటూ.. ఆయన తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా సాగిస్తున్నారు. ఇప్పటికే.. అనేక పథకాలకు ప్రాణం పోసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తాజాగా.. కొత్త అంబులెన్స్ లను తీసుకొస్తున్నారు.. 
 
         వై ఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ పేరుతొ.. అప్పట్లో.. రాజ శేఖర్ రెడ్డి నాయకత్వం లో.. వైద్య విధానికి కొత్త హంగులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అప్పట్లో.. అంబులెన్స్ సర్వీసులు కూడా ఎంతో చక్కగా సాగాయి.. ఆ తరువాత.. వీటి వ్యవస్థ చిన్నాభిన్నమైంది... ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన కాంగ్రెస్ నాయకులూ వీటి పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించారు.. ఎంతో మంది ప్రాణాలను కాపాడే.. అంబులెన్స్ లో నిర్జీవం గా మారి స్క్రాప్ లోకి వెళ్లిపోయాయి.. అంబులెన్స్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది.. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత గా ఉన్నపుడు చేసిన " ప్రజా సంకల్ప యాత్ర" లో ఆయన అంబులెన్స్ సర్వీస్ చేస్తున్న వారి కష్టాలను కళ్లారా చూసి తెలుసుకున్నారు.. ఈ యాత్ర చేస్తున్నప్పుడే.. ఆయన వారికి మాటిచ్చారు.. అంబులెన్స్ వ్యవస్థ ను పునరుద్ధరిస్తామని..తిరిగి జీతాలు పెంచి.. వాటిని సకాలం లో చెల్లిస్తామని.. అంబులెన్స్ కు కొత్త హంగులు తీసుకువస్తామని వై ఎస్ జగన్ మాటిచ్చారు. అన్న మాట ప్రకారమే.. ఆయన కొత్త అంబులెన్స్ లను ప్రజలలోకి తీసుకు రావడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. 
 
            అంబులెన్స్ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం.. అంబులెన్స్ వ్యవస్థను పూర్తి గా ప్రక్షాళన చేయడానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.. ముందుగా, ఉద్యోగులకు వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అంబులెన్స్ వాహనాల్లో రెండు వేల మందికి పైగా ఉద్యోగులున్నారని ఒక అంచనా.  ఈ ఉద్యోగుల్లో గతం లో పైలట్ డ్రైవర్ల కు పదమూడు వేల వేతనం ఉండేది.. ప్రస్తుతం వీరికి వేతనాన్ని ఇరవై ఎనిమిది వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. అలానే... ఎమర్జెన్సీ టెక్నిషియన్లకు పదిహేను వేల జీతం నుండి ముప్పై వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. 
            మరోవైపు.. 104 వాహనాల్లో కూడా సీఎం జగన్ కొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. ఈ వాహనాల్లో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్లకు గతం లో 17 ,500 జీతం ఉండేది.. ఇపుడు ఈ వేతనాన్ని ఇరవై ఎనిమిది  వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. అలానే పైలట్ డ్రైవర్లకు కూడా పదిహేను వేల వేతనం నుంచి ఇరవై ఆరు వేలు పెంచుతున్నట్లు తెలిపారు.
 
         అంబులెన్స్ లలో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెంచడమే కాకుండా.., మరిన్ని అంబులెన్స్ ల సంఖ్యా ను పెంచారు సీఎం జగన్. నూతనం గా.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో అంబులెన్స్ ల సంఖ్యా ను 1060 కు పెంచారు.  నూతన వాహనాలను జులై 1వ తేదీన సి.ఎం.జగన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తారని ఆరోగ్యశ్రీ సి.ఈ.ఓ.మల్లికార్జునరావు తెలిపారు.  రాష్ట్రము లో ఉన్న పదమూడు జిల్లాల్లోనూ.. అన్ని మండలాల్లోనూ ఈ అంబులెన్స్ లు అందుబాటులో ఉండగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.  అంతే కాదు.. గతం లో కంటే.. కొత్త గా వస్తున్నా అంబులెన్స్ లలో అంతర్జాతీయ స్థాయి లో వైద్య ప్రమాణాలను పాటిస్తున్నారు. కొత్తగా రాబోతున్న ఈ అంబులెన్స్ లలో ఎన్నో ప్రత్యేకత లు ఉన్నాయి.. 
           ఈ కొత్త అంబులెన్స్ లను సీఎం జగన్ జులై 1 వ తేదీన ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. కాగా..వీటిలో వెంటిలేటర్,ఇన్ ఫుజాన్ పుంప్స్, సిరంజి పుంప్స్ , మల్టీ పారా మానిటర్, సక్షన్ ఆపరేటర్స్, ఫోల్డల్ స్ట్రేచర్స్ ను అమర్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. కొత్తగా..చిన్నారుల కోసం 26 నియోనేటల్ అంబులెన్సు లు అందుబాటులో ఉంచుతున్నారు. అలానే.. 104 వాహనాలను ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి అనుసంధానం అయ్యేలా ఏర్పాట్లు చేసారు. 
           ఒక్కో అంబులెన్స్ లో 9 రకాల రక్త పరీక్షలు.. 20 రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అలానే.. ప్రతి వాహనాన్ని విలేజ్ క్లినిక్ లకు అనుసంధానం చేస్తున్నారు. ఇలా అనుసంధానం చేయడం వల్ల ఈ వాహనాలు గ్రామీణ ప్రాంతాలకు ఇరవై నిమిషాల్లో.. పట్టణ ప్రాంతాల్లో పదిహేను నిమిషాల్లో చేరుకోగలవని చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే.. ఈ అంబులెన్స్ లు కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే చేరుకోగలవు..ప్రజల ఆరోగ్యం పాలిట వరం గా నిలిచే ఈ అంబులెన్స్ లలో ఇన్ని రకాల సంస్కరణలు తీసుకురావడం నిజం గా హర్షణీయం. 
 
              జులై 1 వ తేదీ న ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా.. ప్రారంభము కానున్న ఈ అంబులెన్స్ లను 203.47 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినట్లు... ఆరోగ్యశ్రీ సి.ఈ.ఓ.మల్లికార్జునరావు తెలిపారు. మండలానికి ఒక 104 వాహనం అందుబాటులో ఉంచనున్నారు.108 అంబులెన్సులు 412 సిద్ధం చేశారు. అడ్వాన్స్ లైఫ్ సపోర్టు వాహనాలు 104, లైఫ్ సపోర్టు బేసిక్ వాహనాలు 282, 104 వాహనాలు 676 అందుబాటులోకి తీసుకువచ్చారు అని మల్లికార్జున రావు చెప్పుకొచ్చారు. 
 
              గతం లో దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి హయం లో అంబులెన్స్ లు ఎంతో ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి.. ఆ తరువాత.. ఈ వ్యవస్థ నిర్వీర్యం కాగా.. ప్రస్తుతం  వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి తనయుడు ఆయన ఆశయాలను అక్షరాలా అమలు జరుపుతున్నారు.  ఎన్నికల ప్రచార సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ, 108 సేవలకు పూర్వ వైభవం తీసుకొని వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారమే.. ఆధునిక పరిజ్ఞానం తో కొత్త అంబులెన్స్ ల ఆవిష్కరణ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox