Breaking News

ఇలాంటి ముఖ్యమంత్రిని చరిత్ర లో చూడలేదు : యనమల 

29 th Oct 2020, UTC

ఆంధ్రప్రదేశ్: మండలి ప్రతిపక్ష నేత, టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు  అధికార వైసీపీ పార్టీ పై, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు. జగన్ రెడ్డి వితండ పాలన, వితండ వాదనల వలన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఇంతటి వితండ ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రము లోను చూడలేదన్నారు. ఓ వైపు.. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుపుతుంటే.. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుకుంటున్నారన్నారు.. ఎన్నికల భయం తోనే.. స్థానిక ఎన్నికలను వైసీపీ వద్దంటోందన్నారు.. 

ఎస్ ఈ సి పరిధిని వైసీపీ ప్రశ్నించిందని.. ఇది వితండమేనని.. అదే ఎస్ఈసి పిలిచినప్పుడు వైసిపి ఎందుకని వెళ్లలేదని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఈసీ భేటీ కి పిలిచినప్పుడు వెళ్లకుండా మీడియా ముందు ప్రెస్ మీట్ లు, ప్రకటనలు పెట్టడమేమిటన్నారు. ఎన్నికల కోసం ఎస్ ఈ సి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. దానిని అధికార పార్టీ అవాయిడ్ చేయడం ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు.. తన పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న విషయం ముఖ్యమంత్రికి అర్ధం అయిందని.. అందుకే స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి అధికార పార్టీ పట్టుబడుతోంది అని యనమల వ్యాఖ్యానించారు.

రాష్ట్రము లో.. లేని ఇమేజ్ ని పెంచుకోవడానికి..  రూ 8కోట్ల 15లక్షలతో ఒప్పందం చేసుకోవడం సిగ్గుచేటన్నారు..  వైసిపి నేతలు ఇమేజ్ పెంచుకోవడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే సహించేది లేదన్నారు. స్థానిక ఎన్నికలనే ఎదుర్కోలేక వాయిదా వేస్తె.. రాబోయే సాధారణ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారని యనమల ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలలో.. ఈ బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలన్నారు. పాత నోటిఫికేషన్లను రద్దు చేసి.. మళ్ళీ మొత్తం స్థానాలకు తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని యనమల డిమాండ్ చేస్తున్నారు.మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox