Breaking News

చంద్రబాబుగానీ, జడ్జీలుగానీ జగన్ వెంట్రుకని కూడ కదపలేరు

06 th Aug 2020, UTC

ఆంధ్ర ప్రదేశ్ : మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనను స్వాగతిస్తూ పార్టీ నాయకులు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గుడ్డివానిచింత వద్ద బుధవారం ఏర్పాటుచేసిన సీఎం జగన్‌ చిత్రపటానికి వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పాలాభిషేకం చేశారు. పండుల తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికయిన సందర్భంగానూ ఈ కార్యక్రమం ఏర్పాటయింది. ఈ సందర్భంగా ఆయన కోర్టులు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
జ్యుడీషియరీగానీ, చంద్రబాబుగానీ, జడ్జీలుగానీ, కేసులుగానీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెంట్రుకని కూడా కదపలేవని వ్యాఖ్యానించారు.రాజధాని రైతులకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నవారంతా రైతులు కాదని, వారి ముసుగులో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులని రవీంద్రబాబు ఆరోపించారు.
 
మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం  ప్రకటించడం వెనుక ఎటువంటి స్వార్థ రాజకీయ లాభాపేక్షా లేదన్నారు. విశాఖ నుంచి పోటీ చేసి జగన్‌ తల్లి విజయలక్ష్మి గతంలో ఓడిపోయారు. ఆ నగరం నుంచి ఎమ్మెల్యేలుగా టీడీపీకి చెందిన ముగ్గురు ఎన్నికయ్యారు. అయినా, రాజకీయ స్వార్థం లేకుండా విశాఖపట్నంను రాజధానిగా జగన్‌ ఎంపిక చేశారు. అదేగనుక ఆయన రాజకీయ స్వలాభం చూసుకొంటే, కడప లేక పులివెందులలోనే రాజధానిని పెట్టేవారు’’ అని రవీంద్రబాబు పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి : ఏపీలో రెండో విడత వైఎస్సార్‌ వాహన మిత్ర..!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox