Breaking News

ఏపీకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు..!

20 th Nov 2020, UTC
ఏపీకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు..!

ఆంధ్రప్రదేశ్ లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు జాతీయ అవార్డులు, విశాఖకు అంతర్జాతీయ అవార్డు లభించింది. తూర్పు , గోదావరి జిల్లాలకు జాతీయ అవార్డులు వచ్చినట్లు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏపీలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఓడిఎఫ్, జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్, నూతన టెక్నాలజీలకు సంబంధించి ఈ అవార్డులు లభించాయి. రెండు జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి షెకావత్ ఈ అవార్డుల ప్రదానం చేశారు.

మరో వైపు విశాఖకు అంతర్జాతీయ అవార్డు రావడం పై పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేసారు. ప్రభుత్వ చర్యలతో పాటు, ప్రజలు కూడా సహకరించినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అవంతి అన్నారు. విశాఖ విషయంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారన్నారు. పేదల విషయంలో నిర్లక్ష్యం చేయలేదన్నారు. 

ఇటీవల స్పెయిన్‌లో జరిగిన స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌–2020లో విశాఖ నగరం కూడా ప్రపంచ నగరాలతో పోటీపడింది. 'లివింగ్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ అవార్డు’ కేటగిరీలో విశాఖ నగరం అవార్డుని పొందింది. విశాఖ మూడవ స్థానంలో నిలిచింది. మొత్తం ఏడూ క్యాటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox