Breaking News

నారా లోకేష్ కు తప్పిన పెను ప్రమాదం..!

26 th Oct 2020, UTC
నారా లోకేష్ కు తప్పిన పెను ప్రమాదం..!

ఆంధ్రప్రదేశ్ :టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కు కొద్దిలో ప్రమాదం తప్పిపోయింది. ఈరోజు ఆయన నడుపుతున్న ట్రాక్టర్ అదుపు తప్పింది. కొంచం సేపు ఉంటె ఆయన నడుపుతున్న ట్రాక్టర్ కాలువలోకి పడబోయింది. ట్రాక్టర్ అదుపు తప్పి కాలువ వైపుకు దూసుకువెళ్లడంతో ఆయనతో కూర్చున్న వారంతా హడలి పోయారు. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆకివీడు ప్రాంతంలో పంటలు ముంపుకి గురయ్యాయి. ఈ పంటలను, ఆక్వా చెరువులను పరిశీలించడానికి నారా లోకేష్ ఆకివీడు ప్రాంతానికి చేరుకున్నారు. నారాలోకేష్ తో పాటు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు కూడా ఆకివీడు ప్రాంతానికి వెళ్లారు. అయితే పర్యటనలో భాగంగా మండపాడు, ఐ.భీమవరం గ్రామాల్లో వీరు పొలాలను పరిశీలించారు. సిద్ధాపురాన్ని చేరుకునే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పింది. నారా లోకేష్ స్వయంగా ట్రాక్టర్ ను నడిపారు. ట్రాక్టరు అదుపు తప్పడంతో రామానాయుడు, మంతెన రామరాజుతో పాటు వెనకాల వారిని అనుసరిస్తున్న వారు కూడా కంగారు పడ్డారు.  అయితే క్షణాల్లో మంతెన రామరాజు ట్రాక్టరును అదుపుచేశారు. దీనితోపెను ప్రమాదం తప్పింది.ఆ తరువాత మరో ట్రాక్టరును తెప్పించారు. మరో ట్రాక్టరు వచ్చిన తరువాత మిగిలిన పర్యటనను పూర్తి చేసుకున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox