Breaking News

ఈ పరిస్దితికి కారణం చంద్రబాబు నాయుడే :నాగబాబు

02 nd Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :రాజధాని విషయంలో మొదటి నుంచి ఒకే విధానం, ఒకే మాట మీద ఉన్నది జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రమేనని జనసేననేత నాగబాబు అన్నారు. అన్ని వేల ఎకరాల భూమిని సమీకరిస్తే ఏదైనా సమస్య ఉత్పన్నమైతే రైతులకు ఎవరు భరోసాగా ఉంటారని  పవన్ 2015లోనే బలంగా మాట్లాడారని ఆయన గుర్తు చేసారు.

ఆదివారం జరిగిన జనసేన పార్టీ పొలిటికల్ కమిటీ టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన  మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతి కోసం వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని, ప్రభుత్వం మారగానే తరలిస్తున్నారని విమర్శించారు.  ఇలా చేస్తే ప్రభుత్వం మీద ప్రజలకు భరోసా పోతుందన్నారు.  ఇకపై భూ సమీకరణలు, భూసేకరణలు చేపడితే ప్రజలు ఏం నమ్మి భూములు ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రైతులు భూములు ఇచ్చారని, ఇప్పుడు రాజధాని తీసుకువెళ్లిపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుందన్నారు. ప్రభుత్వమే మోసం చేస్తోందని, ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి ప్రధాన కారకులు చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. ఆనాడు చేసిన తప్పిదాల వల్లనే ఇవాళ జగన్ తనకు అనుకూలంగా మార్చుకొని రాజధాని తరలించుకొని వెళ్తున్నారని నాగబాబు విమర్శించారు.

జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ టెలీ కాన్ఫరెన్స్  పార్టీ  ప్రధాన కార్యదర్శి తోట చంద్ర శేఖర్ మాట్లాడుతూ రాజధాని వికేంద్రీకరణకు పూర్తి స్థాయిలో ప్రజామోదం కనిపించడం లేదన్నారు. ప్రజలు ఉద్యమించాలన్నా కోవిడ్ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవని, ఈ అంశంపై న్యాయపరమైన పోరాటం చేపట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox