ఆంధ్రప్రదేశ్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం పురోగతిపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రెండో దశ పనులకు సంబంధించి కీలక ఆదేశాలిచ్చారు. మనబడి – నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తొలిదశలో పలు స్కూళ్లలో చేపట్టిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు సమావేశంలో చూపారు.మనబడి నాడు–నేడు కార్యక్రమంలో మిగిలిన 31,073స్కూళ్లు, విద్యా సంస్థల్లో దాదాపు రూ.7700కోట్ల వ్యయంతో పనులు చేపట్టాల్సి ఉందని సమావేశంతో అధికారులు వెల్లడించారు. రెండో దశలో 14,584స్కూళ్లు, విద్యా సంస్థల్లో పనులకు రూ.4732కోట్లు వ్యయం కానుందని, ఈ నెలాఖరులోగా ఆయా స్కూళ్లు, విద్యా సంస్థలను గుర్తించి, వచ్చే ఏడాది జనవరి 14న పనులు ప్రారంభించి జూన్‌నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు తెలిపారు. అదే విధంగా మూడో దశలో 16,489స్కూళ్లు, విద్యా సంస్థల్లో రూ.2969కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్ 30నాటికి వాటన్నింటిని గుర్తించి, నవంబరు 14, 2021నుంచి∙పనులు ప్రారంభించి మార్చి 31, 2022నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
నాడు నేడు పనులన్నీ షెడ్యూల్ ప్రకారం కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందమైన వాల్ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలని, విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్ ఉండాలని ఆదేశించారు. ప్రతి క్లాస్ రూమ్‌లో అన్ని రంగుల టేబుల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. నాడు–నేడు కార్యక్రమంలో చేపడుతున్న పనులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోందని సమావేశంలో అధికారులు చెప్పారు. ఈ ఏడాది అడ్మిషన్లకు కూడా అంచనాలకు మించి స్పందన కనిపిస్తోందని వారు తెలిపారు.
మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 9రకాల మార్పులు చేస్తుండగా, కొత్తగా 10వ అంశంగా కిచెన్‌ను చేర్చారు. సెంట్రలైజ్డ్ కిచెన్‌కు సంబంధించిన ప్లాన్లను అధికారులు సమావేశంలో వివరించారు. వీలైనంత త్వరగా వాటిని ఖరారు చేసి, పూర్తి పరిశుభ్రం గా ఉండేలా నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు.
స్కూళ్లు తెరిచే రోజున విద్యార్థులకు ఇవ్వనున్న జగనన్న విద్యా కానుక కిట్‌ను సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. పిల్లలకు ఇచ్చే బ్యాగ్, బుక్స్, నోట్ బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్ క్లాత్.. అన్నింటినీ స్వయంగా పరిశీలించిన సీఎం వాటి నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని చెప్పారు. ఈ విషయంలో అధికారుల పనితీరును సీఎం ప్రశంసించారు. వచ్చే నెల 5వ తేదీన స్కూళ్లు తిరిగి తెరవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, అప్పటి వరకు ఈ పనులన్నీ పూర్తి కావాలని ఆరోజు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి, ఘనంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
01 Mar 2021
01 Mar 2021
03 Mar 2021