Breaking News

మునిసిపల్ ఎన్నికలు యధావిధిగానే సాగుతాయి : ఏపీ హై కోర్ట్ 

02 nd Mar 2021, UTC

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల హంగామా కాక రేపుతోంది. గతేడాది కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆగిపోయిన మునిసిపల్ ఎన్నికలను కూడా ఎస్ ఈ సి ఈ నెల 10 న నిర్వహించాలని భావించారు. అయితే, ఇందుకు కూడా పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. మునిసిపల్ ఎన్నికలు ఎక్కడ ఆగిపోయాయో అక్కడినుంచే తిరిగి ప్రారంభమవుతాయని నిమ్మగడ్డ ప్రకటించారు. ఈ క్రమంలో మునిసిపల్ ఎన్నికలపై మరోసారి నోటిఫికేషన్ ను విడుదల చేయాలంటూ రిట్ పిటిషన్లు దాఖలు అయ్యాయి.

పాత నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరుపుతున్నారు. కానీ, అప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చాయని పిటిషనర్లు కోర్టుకి తెలిపారు. దాదాపు సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ను మళ్ళి కొనసాగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అయితే, గతంలోనే ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో హై కోర్ట్ ఈ రిట్ పిటిషన్లను కొట్టివేసింది. ఎన్నికలు యధావిధిగానే జరుగుతాయని ఆదేశించింది. 

మరో వైపు వాలంటీర్లపై ఎస్ఈసి ఇచ్చిన ఆదేశాలను కూడా సవాల్ చేస్తూ హై కోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. హై కోర్ట్ వీటిని కూడా విచారించి తీర్పుని రిజర్వ్ లో ఉంచింది. ఈ తీర్పు విడుదల కావాల్సి ఉంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox