Breaking News

కాపు ఉద్యమంలోకి రాను.. ముద్రగడ పద్మనాభం

21 st Sep 2020, UTC
కాపు ఉద్యమంలోకి రాను..  ముద్రగడ పద్మనాభం

ఆంధ్రప్రదేశ్ :మాజీమంత్రి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను సోమవారం కాపు జేఏసీ నేతలు కలిశారు. ఉద్యమ నేతగా కొనసాగాలంటూ ఈ సందర్భంగా ముద్రగడను కోరగా వారి అభ్యర్థనను ఆయన సున్నితంగా తిర్కసరించారు. కాపు ఉద్యమంలోకి  తాను వచ్చేది లేదని ముద్రగడ పద్మనాభం మరోమారు స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మీతోనే ఉంటానని ఆయన తెలిపారు. ఈ భేటీ అనంతరం ఆయన ఓ లేఖ విడుదల చేశారు.

గౌరవ పెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. మీ కోరికను గౌరవించలేక పోతున్నందుకు క్షమించమని కోరుతున్నాను. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటాను. మనం మంచి స్నేహితులం. మీ ఇంటిలో ఏ కార్యక్రమం ఉన్నా తెలియచేస్తే నా ఓపిక ఉన్నంతవరకూ వస్తానండి. మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంతవరకూ ఆహ్వానిస్తాను. దయచేసిన నన్ను ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నాను అని ఆ లేఖలో తెలిపారు.

తాను కాపు ఉద్యమం నేతగా తప్పుకుంటున్నట్లు ముద్రగడ పద్మనాభం రెండు నెలల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. తనపై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు కలత చెంది ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను పదవులకోసమే, మరొకటో ఆశించి ఉద్యమం చేయలేదని ఆయన అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox