Breaking News

స్టీల్ ప్లాంట్ ను వదిలేది లేదు.. : విజయసాయి రెడ్డి

20 th Feb 2021, UTC

ఆంధ్రప్రదేశ్ :విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయడం పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్రను ఈరోజు ఉదయం ప్రారంభించారు. తాజాగా ఈ పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేసారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయి జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్‌ ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌ వరకు పాదయాత్ర చేసారు.

ప్రభుత్వ నిర్ణయమేమిటో పోస్కో ప్రతినిధులకు రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా వివరించారన్నారు. విశాఖకు రావద్దని కూడా స్పష్టం చేశారన్నారు. కడప లేదా కృష్ణపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారన్నారు. అందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. మరో వైపు ఉత్పత్తిని ఆపద్దంటూ విశాఖ ఉక్కు కార్మికులకు సూచించారు. ఉత్పత్తిని ఆపేస్తే, సంస్థ మరింతగా నష్టాల్లో కురుకుపోతుందన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు లేవని, ప్రకాశం జిల్లాలో ఉన్నా అవి ప్రయోజనకరంగా లేవని విజయసాయి అన్నారు. ఇప్పటివరకు గనుల సమీకరణకు ఒడిశాకు రూ.1500 కోట్లు  ఇచ్చామని పేర్కొన్నారు. విశాఖకు రూ.20 వేల కోట్ల భారం ఉందని, దాదాపు రూ.2,700 కోట్లు వడ్డీ కడుతున్నామని విజయ సాయి పేర్కొన్నారు. రుణ భారం అధికంగా ఉండడం వల్లనే విశాఖ ఉక్కు నష్టాల్లోకి వెళ్లిందన్నారు. ఈ రుణ భారాన్ని కేంద్రం ఈక్విటీగా మారిస్తే, సంస్థ తిరిగి లాభాల బాట పడుతుందని విజయసాయి స్పష్టం చేసారు. మరో వైపు స్టీల్ ప్లాంట్ లో ఉన్నత స్థాయిలో ఇతర రాష్ట్రాల అధికారులున్నారని, వీరు కేంద్రాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox