Breaking News

ప్రివిలేజ్ కమిటీ ముందు భోరుమన్న ఎమ్మెల్యే రోజా

18 th Jan 2021, UTC

ఎమ్మెల్యే నయినప్పటికీ ప్రొటోకాల్ ప్రకారం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, నగరి ఎమ్మెల్యే రోజా శాసనసభ ప్రివిలైజ్ కమిటీ ఎదుట బోరున విలపించారు. టీటీడీలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఫిర్యాదు చేశారు. ఎన్ని కమిటీలు వచ్చినా, ఎంత మందికి చెప్పుకున్నా, పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. 

ప్రొటోకాల్ ప్రకారం అధికార కార్యక్రమాలకు పిలవకపోవడం.సొంత నియోజకవర్గంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగినా సమాచారం రోజా ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగా తిరుపతిలో ఇవాళ విచారణకు హాజరయ్యారు. గతంలో ఇలా పలుసార్లు జరిగిందని కమిటీ ముందు తన ఆవేదన వెలిబుచ్చారు. సొంత పార్టీ అధికారంలో ఉండగా తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని, సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధికారులపై ఫిర్యాదు చేశారు. శాసనసభ సభ్యురాలిగా ప్రొటోకాల్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగేలా చూడాలని కమిటీని కోరారు.   

ఎమ్మెల్యే రోజా కన్నీటి వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలే ఆమె ఆవేదనకు కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత రోజాకు క్యాబినెట్ లో బెర్త్ ఖాయమని భావించినప్పటికీ సామాజిక సమీకరణాల కారణంగా మంత్రి పదవి రాలేదు. సీఎం జగన్ తరువాత ఆమెను ఏపీఐఐసి ఛైర్మన్ గా నియిమించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox