Breaking News

మెగాస్టార్ చిరంజీవి- సీఎం జగన్ ల భేటీ

14 th Jan 2022, UTC
మెగాస్టార్ చిరంజీవి- సీఎం జగన్ ల భేటీ

Megastar Chiranjeevi :తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై ఏపీ సీఎం జగన్‌తో  మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో లంచ్ భేటీ జరిగింది.  దాదాపు గంటా పదిహేను నిమిషాల పాటు  ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సినిమా ఇండస్ట్రీలోని పలు అంశాలు, టికెట్ల వివాదంపై నెలకొన్న సందిగ్ధతకు సంబంధించి చర్చించారు. 

అందరి అభిప్రాయాలను జగన్‌కు వివరించినట్లు చిరంజీవి తెలిపారు. ఈసారి ఇండస్ట్రీలో ప్రముఖులతో పాటు వచ్చి చర్చించేందుకు అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నో తర్జన భర్జనలున్నాయి...అగమ్యగోచర పరిస్థితి ఉందని జగన్‌కు చిరు తెలిపారు. టికెట్ల రేట్ల సమస్య కొలిక్కి  రాకపోవడంతో చాలామంది ఆందోళనగా ఉన్నారని సీఎం దృష్టికి మెగాస్టార్ తీసుకెళ్లారు. సినిమా టికెట్ల ధరలను పెంచాలని జగన్‌ను చిరంజీవి కోరారు. కొవిడ్ కారణంగా సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందుల్లో ఉందని.. ఆదుకోవాల్సిన అవసరం ఉందని జగన్‌తో చిరంజీవి అన్నారు.తనకు తానుగా రాలేదని...జగన్‌ ఆహ్వానం మేరకే వచ్చినట్లు చిరంజీవి మరోసారి క్లారిటీ ఇచ్చారు.  థియేటర్ల సాధకబాధకాలను తెలియజేశానన్నారు. అన్నింటిపైనా కమిటీ వేసి.. తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్‌ చెప్పినట్లు తెలిపారు. అన్నింటినీ సానుకూలంగా తీసుకుంటామని జగన్‌ హామీ ఇచ్చారన్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని.. అభద్రతా భావంతో ఉన్న సినీ కార్మికులకు ధైర్యం కల్పించాలని కోరారు చిరు. దీనికి జగన్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సమస్యలపై సమగ్రంగా  ఒక నివేదిక ఇస్తామని జగన్‌తో చర్చ సందర్భంగా చిరంజీవి అన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదని జగన్‌ భరోసా ఇచ్చినట్లు తెలిపారు. అనవసరంగా ఆందోళన పడి నోరు జారొద్దని ఇండస్ట్రీ లో వారికి చిరు స్వీట్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చారు. తాను  సినీ పరిశ్రమ పెద్దగా కాదు...బిడ్డగా  వచ్చానన్నారు. వారం పది రోజుల్లో ఒక జీవో వస్తుందని ఆశిస్తున్నట్లు మెగాస్టార్ కాన్ఫిడెంట్‌గా చెప్పారు. 

చిన్న సినిమాలకు సంబంధించి ఐదవ షో ఉండాలని కోరినట్లు కూడా చిరంజీవి వివరించారు. అన్నీ పరిగణనలోకి తీసుకుంటానని జగన్‌  చెప్పారని... మీరు ఎప్పుడొచ్చినా భోజన సమయంలోనే కలుద్దామని జగన్‌ ఎంతో ఆప్యాయత కనబరిచినట్లు చిరు తెలిపారు. ఎంతమందితో  సమావేశం కావాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం జరుగుతుందని ఆశిస్తున్నాట్లు చిరు అన్నారు. పరిశ్రమ నుంచి, ఎగ్జిబిటర్స్, కార్మికులు అందరి సమస్యలు వివరించానని చిరంజీవి జగన్‌తో భేటీ తర్వాత స్పష్టం చేశారు.మొత్తానికి ఇది ఆరంభం మాత్రమేనని... సమస్య  పరిష్కారం కావాలంటే మళ్ళీ ఒకసారి కలవాల్సిన అవసరముందని చిరంజీవి స్పష్టం చేశారు. దీంతో నెక్ట్స్ భేటీలోఅయినా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్, టికెట్ల వివాదంపై ఒక స్పష్టత, పరిష్కారం వస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని వినోదం వార్తలు చదవండి

 జడ్డు.. ఇన్‌స్టా పోస్ట్..

ఎవరికి బలిసిందో తెలియాలంటే ఓపెన్ డిబేట్‌కు రావాలి.. తమ్మారెడ్డి భరద్వాజ

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox