Breaking News

ఊర్మిళ ఆరోపణలకు వివరణ ఇచ్చిన మాన్సన్ ట్రస్ట్..!

30 th Oct 2020, UTC

విజయనగరం సిరిమాను ఉత్సవాల్లో తమను అవమానకర రీతిలో చూశారంటూ నిన్న ఆనందగజపతి రాజు మరో కుమార్తె ఊర్మిళ గజపతిరాజు ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యానించిన సంగతి విదితమే. గత కొంత కాలంగా పూసపాటి రాజ కుటుంబీకుల మధ్య  విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే పైడితల్లి సిరిమాను ఉత్సవం నేపధ్యంలో అమ్మవారిని చూడడానికి ఊర్మిళ గజపతిరాజు, ఆమె తల్లి విజయనగరం చేరుకున్నారు. అయితే విజయనగరం వారిద్దరి పట్ల అవమానపూరితంగా ప్రవర్తించారంటూ నిన్న ఊర్మిళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
తాజాగా ఈ వ్యాఖ్యల పట్ల మాన్సన్ ట్రస్ట్ స్పందించింది. సిరిమానోత్సవం సందర్భంగా కోట బురుజుపై మాన్సాస్ ట్రస్టు అధినేతలకు ముందు వరసలో సీట్లు కేటాయించే ఆనవాయితీ ఉందని మాన్సన్ ట్రస్ట్ ఈ లేఖ లో గుర్తు చేసింది. అయినప్పటికీ కొందరు అనుమతులు లేకుండానే మాన్సన్ ట్రస్ట్ చైర్ పర్సన్ కోసం కేటాయించిన సీట్లలో కూర్చున్నారని లేఖ లో పేర్కొన్నారు. ఊర్మిళ, సుధా గజపతిరాజు ఆలయ ఈవో పక్కనే కూర్చుని సిరిమానోత్సవం తిలకించారని తెలిపారు.. అయినా కూడా.. సీట్లు కేటాయించకుండా అవమానించారని నిందలేయడం సమంజసం కాదన్నారు.

"వారిద్దరూ తమని తాము మహారాణి, రాజకుమార్తెలా భావించుకుంటున్నారని లేఖలో తమ అభిప్రాయం తెలిపారు. కానీ, సిరిమాను ప్రజల ఉత్సవం అని ప్రజాస్వామ్య కాలంలో కూడా కొందరు రాచరిక వ్యవస్థనే కోరుకోవడం దురదృష్టకరమని, పేర్కొన్నారు. ఈ ఘటనలో ఊర్మిళ, ఆమె తల్లి ప్రవర్తించిన తీరు అహంకారపూరితంగా ఉంది" అని మాన్సన్ ట్రస్ట్ తమ లేఖలో పేర్కొంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox