Breaking News

జాతకాల పేరు చెప్పి సర్వం దోచేశారు.. వీరి మాయలో పడకండి..!

27 th Jan 2021, UTC

ఆంధ్రప్రదేశ్ :వినేవాడు అమాయకుడైతే, కోతల రాయళ్ళు తమ ప్రతాపం చూపిస్తారు. జాతకాలను నమ్మాలి కానీ,మరీ జీవితాలను నాశనం చేసుకునే విధంగా, ప్రతి వాళ్ళు చెప్పినది నమ్ముకుంటూ పోకూడదు. ఈ మూఢనమ్మకాలు, జాతకాలు వినేవాళ్ళుంటే చెప్పే వాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు. జాతకాలను నమ్ముకుని, కూతురి జీవితం నాశనం చేసిందే కాకుండా, తమ ఆస్తుల్ని కూడా ఓ కుటుంబం అమ్ముకుని రోడ్డున పడింది. ఈ ఘటన ఎపిలో చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణారెడ్డి, నిర్మల దంపతులు చిత్తూరు జిల్లా బి.కొత్త కోటలో నివాసం ఉంటున్నారు. వీరికి వెంకట్ రెడ్డి అనే ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం స్నేహంగా మారి ఆ వ్యక్తి ఏమి చెప్పినా వీరి కుటుంబం నమ్మడం మొదలు పెట్టింది. క్రమంగా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. కృష్ణ రెడ్డి కుటుంబం బలహీనతను వెంకట్ రెడ్డి క్యాష్ చేసుకోవడం మొదలు పెట్టాడు. కృష్ణారెడ్డి జాతకంలో దోషం ఉందని, తనకు తెలిసిన వారి వద్దకు తీసుకెళ్తానని చెప్పి ఓ మాతాజీ వద్దకు తీసుకువెళ్లాడు.

ఆమె కుమార్తెకు పెళ్లి చేయకపోతే మరణగండం ఉందని చెప్పి భయపెట్టింది. ఆమె చెప్పినట్లు చరణ్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసారు. అంతటితో ఆగకుండా, ఇంట్లో వాస్తు దోషం ఉందని చెప్పి, ఆ ఇంటిని కూడా వేరొకరి పేరుపైన రాయించారు. అంతటితో అవలేదు, ఇంకా దోషాలు పోలేదని, పూజలు చేయించాలని చెప్పి మాతాజీ మరో ఇరవై వేలు వసూలు చేసారు. మరో వైపు ఆ చరణ్ అనే వ్యక్తి కృష్ణారెడ్డి కూతురుని చిత్ర హింసలు పెడుతుంటే కృష్ణారెడ్డి కుటుంబం తల్లడిల్లిపోయింది. చేసేది లేక కృష్ణారెడ్డి కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. గత ఆరునెలలుగా తమను నమ్మించి మోసం చేసారని, మరో వైపు తమ కూతుర్ని కూడా చిత్ర హింసలు పెడుతున్నారని పోలిసుల వద్దకు వచ్చి వాపోయారు. వీరి నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకుని పోలీసులు వెంకటరెడ్డి,మాతాజీ తో పాటు చరణ్ పై కేసు నమోదు చేసారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox