Breaking News

సీఎం జగన్‌కు ఆరు పేజీల లేఖ రాసిన ఎంపీ రఘురామ కృష్ణరాజు..!

29 th Jun 2020, UTC
సీఎం జగన్‌కు ఆరు పేజీల లేఖ రాసిన ఎంపీ రఘురామ కృష్ణరాజు..!
సీఎం జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఆరు పేజీలతో కూడిన లేఖను సీఎంకు పంపించారు. ఈ మధ్య విజయసాయిరెడ్డి నుంచి నోటీసు అందిందని, ఆయన లేఖకు స్పందిస్తూ రిప్లై ఇస్తున్నట్లు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. సీ ఓటర్‌ సర్వేలో 4వ స్థానం వచ్చినందుకు జగన్‌కు అభినందనలు తెలిపారు. త్వరలో మొదటి స్థానం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తెలుగు మీడియం విషయం రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని.. దానికి వ్యతిరేకంగా ఎలా ఉండగలను అన్నారు.తనను కొందరు యాంటీ క్రిస్టియన్‌గా చిత్రీకరించారని రఘురామ ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్‌లో మాట్లాడానని.. సీఎం కూడా చాలా సంతృప్తి చెందారన్నారు. కొందరు పార్టీ నుంచి వెళ్లిపోతానంటూ కథనాలు కల్పించారని.. ఈ విషయం జగన్‌కు తెలియజేయాలని మిథున్‌రెడ్డిని కోరానన్నారు. ఇక పార్టీ లెటర్ హెడ్ కాకుండా మరో లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారన్నారు.

 ఇసుక విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. గతంలో అధికార పార్టీకి చెందినవారు కూడా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఢిల్లీలో ఎంపీలకు ఇచ్చిన విందుకు అన్నీ పార్టీల వారు వచ్చారని గుర్తు చేశారు.

ఇక తనకు బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతోనే తాను లోక్‌సభ స్పీకర్.. కేంద్రానికి లేఖ రాశాను అన్నారు. తన గెలుపు 90శాతం అధినేత వల్ల.. 10శాతం తనవల్ల ఉందని గతంలో చెప్పానన్నారు. తాను పార్టీ లైన్ ఎప్పుడూ దాటలేదని.. వ్యతిరేకంగా మాట్లాడలేదంటున్నారు.

 గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే తనకు లేఖ పంపించడానికి విజయసాయిరెడ్డి  ఎవరంటూ నిలదీశారు. రిజిస్టరయిన పార్టీ పేరుతో కాకుండా మరో పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసు అందిందని తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని.. పలు సందర్భాల్లో ఈసీ మనపార్టీకి రాసిన లేఖలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని గుర్తుచేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరును ఏ సందర్భంలోనూ వాడుకునే అవకాశం లేదని ఈసీ తేల్చి చెప్పిందని రఘురామకృష్ణరాజు వెల్లడించారు.

 ప్రధాని మోదీపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఓ సాంగ్ విడుదల చేశారు. సాంగ్‌ను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. 
 
 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox