Breaking News

తారక్ ను పంపమంటే.. లోకేష్ ను పంపుతానన్న చంద్రబాబు..!

27 th Feb 2021, UTC

ఏపీలో ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటన కోసం వెళ్లారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడుకు ఘోర పరాజయం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలంటూ అక్కడి స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. 

టీడీపీ పార్టీ కీలక బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలంటూ అక్కడ స్థానికులు చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేసారు. పలువురు కార్యకర్తలు సైతం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఆ ప్రాంతమంతా జై ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తింది. వీరందరిని దాటుకుని, చంద్రబాబు నాయుడు పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన చంద్రబాబు కార్యకర్తలతో కల్సి పనిచేయాలన్నారు.

అందరి సక్రమంగా పని చేసి మునిసిపల్ ఎన్నికలలో టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన వారు గెలిచేలా పోరాడాలన్నారు. ప్రత్యర్ధులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రచారాలు చేయాలన్నారు. ఈ సందర్భంలో మరో సారి కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలంటూ డిమాండ్ చేసారు. అయితే, చంద్రబాబు నాయుడు ఇవేమి పట్టించుకోలేదు. తాను మూడు నెలలకోసారి కుప్పంకు వస్తానని పేర్కొన్నారు. తాను కాకుంటే లోకేష్ ను పంపుతామన్నారు. పార్టీ ముఖ్య నేతలు కూడా వస్తూనే ఉంటారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్ని సార్లు జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేసిన, చంద్రబాబు నాయుడు మౌనం వహించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox