Breaking News

నామినేటెడ్ పదవుల్లో సామాజిక అన్యాయం కూనరవికుమార్

21 st Jul 2021, UTC

జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. కుర్చీలు లేని పదవులు, నిధులులేని కార్పొరేషన్లు ఆయా వర్గాలకు ఇవ్వడం ఎలాంటి సామాజిక న్యాయమో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని ఆయన ఎద్దేవా చేసారు.

రాజ్యాంగంలో నిర్వచించిన సామాజిక న్యాయానికి బదులు జగన్ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగంలోని సామాజిక అన్యాయానికి పాల్పడింది. ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీల ఆర్థిక ఎదుగుదలకు ఈ ప్రభుత్వం తీసుకున్నచర్యలు శూన్యమనే చెప్పాలి. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వం భర్తీచేసిన 136కార్పేషన్లు ఎవరికి ఇచ్చారు. అధికారాలు, హంగులు, విధులు, నిధులున్న కార్పొరేషన్లు, ఇతరత్రా నామినేటెడ్ పదవులను రెడ్డి  వర్గానికి కట్టబెట్టి  ఏమాత్రం ప్రాధాన్యత లేని, కనీసం తమకుతాము కూడా న్యాయం చేసుకోలేని ఉత్తుత్తి పదవులను ఇతర వర్గాలకు కట్టబెట్టారు. ఇదేమీ సామాజికన్యాయమో ప్రభుత్వమే చెప్పాలి'' అని రవికుమార్ నిలదీశారు. 

'కుర్చీలు కూడా లేని కార్పొరేషన్ల పదవులు బీసీలకు ఇచ్చి వారిని అవమానిస్తారా? బడుగు బలహీనవర్గాల ఓట్లతో అందలం ఎక్కిన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బడుగులను నేడు అణగదొక్కుతున్నాడు. బరువు, బాధ్యతలు బడుగుబలహీన వర్గాలు మోస్తుంటే అధికారమేమో రెడ్లు అనుభవిస్తున్నారు. ఈ వాస్తవాన్ని ప్రతి బీసీ వ్యక్తి గ్రహించాలి. తమకు జరుగుతున్న అన్యాయం పై బడుగు, బలహీన వర్గాలు జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని నిలదీయాలని రవికుమార్ సూచించారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox