జనసేన అధినేత పవన్..కల్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్‌గా ఉంటూ కేవలం చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. విమర్శించారు. విశాఖ గాజువాక నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు విశాఖలో రాజధానిని వ్యతిరేకించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అమరావతిపై పవన్ కల్యాణ్ ఒక్కడికే ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మ, పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేస్తూ సినిమా తీస్తున్న నేపథ్యంలో.. ఆ బాధలో నిన్నటి వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నామని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారని, ఆయనకు రాష్ట్ర పరిస్థితులపై అవగాహన లేదని విమర్శించారు.
ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధాని వస్తే నీకేమి బాధ అని కరణం ధర్మశ్రీ, పవన్‌ని ప్రశ్నించారు. మూడు రాజదానులు రావు అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పాదంగా ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పి.. ఒక్క సీటుకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. ఇంతా జరిగినా ఇంకా పవన్ కల్యాణ్‌లో మార్పు రాకపోవడం దురదృష్టకరం అన్నారు.
పవన్‌ది జనసేన కాదు.. కళసేన అని తీవ్ర విమర్శలు చేశారు. మూడు రాజధానులు రావడం ఖాయమన్నారు. ఒక విధానం అంటూ లేకుండా ఆరునెలలుకు ఒకసారి బయటకు వచ్చి తప్పుడు ప్రచారాలు చేసి కనుమరుగవ్వడం పవన్ కల్యాణ్‌కు అలవాటన్నారు.
ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలు పవన్ కల్యాణ్‌కు తగిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజల వద్దకే పాలన కోసం సచివాలయం... వాలంటీర్ల వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని కరణం ధర్మశ్రీ తెలిపారు.
. కరోనా వైరస్‌కు సంభంధించి ఏపీలో రోజుకు వేలల్లో టెస్ట్ చేస్తున్నారని.. దేశంలోనే కరోనా టెస్టులు చెయ్యడం, నియంత్రణ చర్యలు తీసుకోవడంలో ఏపీ ముందుందని ఆయన అన్నారు.