Breaking News

JC Prabhakarreddy : 72 కేసులు పెట్టారు. ఇంకో నాలుగుకేసులు పెట్టుకోండి.. జేసీ ప్రభాకరరెడ్డి

31 st Jul 2021, UTC

Political : ఇప్పటి వరకు తనపై 72 కేసులు పెట్టారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అన్నారు. ఇంకా నాలుగు కేసులు పెట్టుకోండి జైలుకు పోయేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై వర్రీ అవుతున్నానని, ఎవరిని సంతోష పెట్టేందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. ఎక్కడ దాక్కునా పోలీసులు వదిలిపెట్టరన్నారు. మీసాలు తిప్పితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. న్యాయ పరంగానే పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేసి వుంటే తాను మీసం మెలేసేవాడిని కాదన్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. 

దీనిపై ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ ఒకటిన్నర సంవత్సరం క్రితమే ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకే తాను జవాబు ఇచ్చాని పేర్కొన్నారు.పెద్దారెడ్డి మొహం చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, పెద్దారెడ్డి తన మొహాన్ని ఓసారి అద్దంలో చూసుకోవాలని, జగన్ ను చూసి ఓట్లేశారని ఆయన అన్నారు. దమ్ముంటే సెంటర్ లోకి రా చూసుకుందామని జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox