Breaking News

టీడీపీ వ‌ర్సెస్ టీడీపీ.. పుట్టప‌ర్తిలో హైటెన్షన్‌

13 th May 2022, UTC

Andhrapradesh: శ్రీ స‌త్యసాయి జిల్లా కేంద్రం పుట్టప‌ర్తిలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి, అదే పార్టీకి చెందిన తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మన్ జేసీ ప్రభాక‌ర్‌రెడ్డిల మ‌ధ్య నెల‌కొన్న వివాదమే ఈ టెన్షన్‌కు దారి తీసింది. 

తాడిప‌త్రి నియోజ‌కవ‌ర్గానికి చెందిన జేసీ ప్రభాక‌ర్ రెడ్డి త‌న నియోజ‌క‌వ‌ర్గమైన పుట్టప‌ర్తిలోకి త‌న అనుమ‌తి లేకుండా ఎలా వ‌స్తారంటూ ర‌ఘునాథ‌రెడ్డి చాలా కాలం నుంచే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా స‌త్యసాయి జిల్లా క‌లెక్టర్‌ను క‌లిసేందుకంటూ జేసీ పుట్టప‌ర్తికి బ‌య‌లుదేరారు. దీనిపై స‌మాచారం అందుకున్న ప‌ల్లె అనుచ‌రులు భారీ ఎత్తున నిర‌స‌న వ్యక్తం చేసేందుకు సిద్ధప‌డ్డారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ త‌ప్పద‌ని ఆందోళన నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పుట్టప‌ర్తిలో జేసీని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి త‌ర‌లించారు. 

ఉజ్వల విల్లాల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయమై పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. తాను ఉజ్వల విల్లాల విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి వస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అయితే  పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు భారీగా పుట్టపర్తిలో మోహరించడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని భావించి జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే ఈ విషయమై పోలీసులు ఏ రకమైన నోటీసు ఇస్తారనే విషయమై చూసిన తర్వాత స్పందిస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox