ఇటీవల పవన్ కళ్యాణ్ జన సైనికుల కోసం ఓ ఇంటర్వ్యూ ను ఇచ్చారు.. ఈ ఇంటర్వ్యూ లో ఆయన న్యూ లుక్ లో కనిపించారు. కరోనా లాక్ డౌన్ కారణం గా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంటికే పరిమితం అయ్యారు. ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉంటూ.. దేశ, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు షూటింగ్ లలో తిరిగి పాల్గొన్నప్పుడు దర్శన మిచ్చిన జనసేనాని.. ఆ తరువాత పెద్దగా కనిపించలేదు.. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా అంతర్గతంగా పవన్ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.. కానీ అభిమానులకు మాత్రం ఆయన దర్శన భాగ్యం లేదు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ న్యూ లుక్ లో కనిపించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ మీడియా విభాగం, సోషల్ మీడియా విభాగాల కోరిక మేరకు వారికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారని జనసేన పార్టీ తెలిపింది. కరోనా మహమ్మారి నిబంధనలను పూర్తి గా పాటిస్తూ ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష లో ఉన్న సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కొనుగోలు చేసిన చేనేత వస్త్రాలను ఆయన ధరించారని జన సేన పార్టీ తెలిపింది.
చాతుర్మాస దీక్ష లోని విశేషాలను కూడా పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ లో పంచుకున్నట్లు తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో జాతీయ, ప్రాంతీయ అంశాలపై పవన్ సుదీర్ఘంగా తన అభిప్రాయాలను, జనసేన విధానాన్ని ప్రస్తావించారు. కరోనా వ్యాప్తి, అత్మనిర్భర భారత్ కార్యక్రమం ఆశయం..చైనా తో ఘర్షణల నేపధ్యం లో ప్రధాని మోడీ వైఖరి గురించి.. పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కరోనాపై వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత, దాళితులపై దాడులపై ఈ ఇంటర్వ్యూ లో ఆయన నిలదీశారు. ఈ ఇంటర్వ్యూ తోలి భాగం నేడు అభిమానుల ముందుకు రానుంది.

సమకాలీన రాజకీయ పరిస్థితులు, కరోనా అత్యయిక పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మరెన్నో అంశాలపై జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పందన ప్రత్యేక ఇంటర్వ్యూ లో

Exclusive on : https://t.co/spri3sy7kQ https://t.co/36PTNMwWXo https://t.co/cdupUoricb pic.twitter.com/vrgWYs9pf2
— JanaSena Party (@JanaSenaParty) July 22, 2020