ఆంధ్ర ప్రదేశ్: ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యంతో తన తండ్రి మరణించారని ఓ మహిళ ఏడూస్తూ
ముఖ్యమంత్రి జగన్మోన్ రెడ్డిని నిలదీసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, తగినంత సిబ్బంది ఉన్నారని ప్రభుత్వం చెబుతోందని. తన తండ్రికి గుండెపోటు రావడంతో వినుకొండ నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎమర్జెన్సీ కేసు అని ఎంత బ్రతిమిలాడినా వారు డాక్టర్ను పిలవలేదని దీంతో తన తండ్రి మరణించారని ఆమె రోదిస్తూ చెప్పింది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవడంలేదని ఆమె ప్రశ్నించింది. తన తండ్రి రెండు గంటలు విలవిల్లాడిపోయారని, ఒక్కరూ పట్టించుకోలేదని తన కళ్లముందే తండ్రి ప్రాణాలు పోయాయని ఆమె కన్నీటిపర్యంతమైంది. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు చూస్తే అంతా తెలుస్తుందని ఆమె చెప్పింది. ‘జగనన్నా ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకుండా చూడన్నా’ అంటూ ఆమె వేడుకుంది.
మరిన్ని వార్తలు చదవండి : జగన్ సర్కార్ మరో 'వరం'..!