Breaking News

టాలీవుడ్ కు జగన్ షాక్ బెనిఫిట్ షోలు రద్దు.. ఆన్ లైన్ టికెటింగ్

24 th Nov 2021, UTC

టాలీవుడ్  పెద్దలు, నిర్మాతలు ఎన్ని సార్లు బ్రతిమాలినా , వినతులు పంపుకున్నా  ఏపీ సీఎం జగన్ మాత్రం తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు.  బెనిఫిట్ షోల రద్దుకు, ఆన్ లైన్ టికెట్ వ్యవస్దకు   పచ్చ జెండా ఊపేసారు.. ఈ మేరకు ఏపీ సినిమాటోగ్రఫీ చట్ట సవరణబిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

  ఈ సందర్బంగా బుధ‌వారం మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో మాట్లాడుతూ పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలంద‌రికీ ప్ర‌ధాన వినోదాత్మ‌కంగా ఉంటున్న సినిమా మాధ్య‌మాన్ని సొమ్ము చేసుకునేదానికి ఎక్కువ మంది న‌డుం క‌డుతున్నారు. ప్ర‌భుత్వ నిర్దేశిత రేట్ల ప్ర‌కారం ఉన్న‌టువంటి రేట్ల‌కు కాకుండా ఎక్కువ రేట్లకు టిక్కెట్స్‌ను అమ్ముతున్నారు. రోజుకి నాలుగు షోల‌ను మాత్ర‌మే వేయాల‌ని చ‌ట్టం చెబుతుంది. కానీ సూర్యుడు లేవ‌క‌ముందే షో వేయ‌డం. ఆ షోలో ఒక్కొక్క ప్రేక్ష‌కుడి ద‌గ్గ‌ర ఒక్కొక్క ర‌కంగా ఇష్టా రాజ్యంగా టిక్కెట్ ధ‌ర‌ను నిర్ణ‌యించి వ‌సూలు చేసి పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రేక్ష‌కుల ఇష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.సినిమా ప‌రిశ్ర‌మ‌లో మేం చేసినా ఎదురుండ‌కూడ‌దు. చ‌ట్టాల మ‌మ్మ‌ల్ని ఆప‌వు అనే పోక‌డ‌లు ఉండ‌టాన్ని ఇప్పుడు మ‌నం చూడొచ్చు. అలా ఉండకుండా టిక్కెట్టు రేట్స్ పెంచేసి ప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌ల‌ను సొమ్ము చేసుకోకుండా క‌ట్ట‌డి చేయ‌డానికి ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ వ్య‌వ‌స్థ‌ను తీసుకు రావాల‌ని అనుకుంటున్నాం. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు మేలైన సౌకర్యం క‌లుగుతుంది. సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టంలో మార్పు తీసుకు రావ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు మేలు క‌లుగుతుంది. నిర్మాత‌లు ఇది వ‌ర‌కు విడుద‌లైన సినిమాల విష‌యంలో చెప్పిన క‌లెక్ష‌న్స్‌కు, ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ట్యాక్స్‌కు ఎక్క‌డా పొంత‌న ఉండ‌టం లేదు. అందుక‌నే ఆన్‌లైన్ టికెటింగ్‌ను తీసుకొస్తే, ప్ర‌భుత్వానికి రావాల్సిన ట్యాక్స్‌ల‌ను ఎవ‌రూ కూడా దాచే ప‌రిస్థితి ఉండ‌దని అన్నారు

కరోనాకి ముందు కొన్ని పెద్ద సినిమాలకి కూడా టికెట్ రేట్లు పెంచుకోడానికి ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఇప్పుడు కొత్తగా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థని కూడా తెరపైకి తేవడంతో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టికెట్ రేట్స్‌ను పెంచుతుంద‌ని భావిస్తూ వ‌చ్చిన పెద్ద నిర్మాత‌ల‌కు కూడా ఈ నిర్ణ‌యం  షాక్ అనే చెప్పాలి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox